పోచంపల్లిని సందర్శించిన ప్రపంచ సుందరీమణులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని కూడా సుందరీమణులు దర్శించుకున్నారు.

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రపంచ సుందరీమణులు ఇవాళ పోచంపల్లి టూరిజం పార్క్‌ను సందర్శించారు. కంటెస్టెంట్లకు నుదుటన సిందూరం దిద్ది సంప్రదాయంగా స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. ప్రపంచ సుందరీమణులు వస్త్రాల తయారీని పరిశీలించారు.
చేనేత కళాకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చేనేత స్టాల్‌ను, చీరల ప్రత్యేకత, తయారీ విధానాన్ని పరిశీలించారు. రాట్నంతో నూలు వడికే విధానాన్ని చూశారు. లయబద్ద కిన్నెర, డప్పు వాయిద్యాలు వారిని మంత్రముగ్ధుల్ని చేశాయి. డప్పు, కిన్నెరలు స్వయంగా వాయిస్తూ మైమరచిపోయారు పలువురు అందగత్తెలు.
Also Read: కడప నెక్ట్స్ మేయర్ ఎవరు? రేసులో ముందుందెవరు?
కిన్నెర, డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం కూడా చేశారు. పలువురు సుందరీమణులు రాట్నం వడికారు. చీరల తయారీని పరిశీలించడంతో పాటు స్వయంగా చీరలను నేశారు. తమ చేతులపై మెహందీ టాటూలు వేయించుకుని మురిసిపోయారు. అలాగే, ఇవాళ సాయంత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సుందరీమణులు దర్శించుకున్నారు. అఖండ దీపారాధన మండపంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలోనూ వారు పాల్గొన్నారు.