లారా రవికుమార్ మిస్సింగ్ సుఖాంతం, 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది

hayatnagar
Missing 16-year-old Student Lara Ravikumar : లారా రవికుమార్ మిస్సింగ్ సుఖాంతం, 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది
లారా మిస్సింగ్ వ్యవహారం సుఖాంతమైంది. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన లారా ఆదివారం రాత్రి ఇంటికి చేరుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్ హయత్ నగర్‌కు చెందిన లారా రవికుమార్ అక్టోబర్ 7న ఇంటి నుంచి వెళ్లిపోయింది. తండ్రితో గొడవపడి రాత్రిపూట ఇల్లు వదిలి వెళ్లింది. ఆమె కోసం ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 8 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
సోషల్ మీడియాలో లారా మిస్సింగ్ పై ప్రచారం జరిగింది. మీడియాలో, వాట్సప్ గ్రూపుల్లో లారా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆమె తమకు కనిపించిందంటూ చాలా మంది సమాచారం ఇచ్చారు. కానీ, అవేవీ ఆమెను కనిపెట్టడానికి ఉపయోగపడలేదు. నాలుగు రోజుల తర్వాత లారా ఇంటికి చేరింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవదులు లేవు. అయితే లారా ఈ నాలుగు రోజులు ఎక్కడుంది. ఎక్కడ షెల్టర్ తీసుకుందో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారంలో రవి కుమార్, అపర్ణ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంటర్ చదువుతున్న కుమార్తె లారా కూడా వీరితో పాటే ఉంటోంది. అయితే అర్థరాత్రి అయినా సోషల్ మీడియాలో ఉంటూ చాటింగ్ చేస్తున్నావేంటని తల్లిదండ్రులు లారాను నిలదీశారు.
దీంతో పేరెంట్స్‌తో గొడవ పడి 2020, అక్టోబర్ 7వ తేదీ బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లోంచి వెళ్లిపోయింది లారా. తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు తల్లిదండ్రులు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మౌంట్ లిటరజీ స్కూల్‌లో ఇంటర్ చదువుతోంది లారా.