Telangana PCC : పీసీసీ అధ్యక్ష పదవిని అడుగుతున్నా- జగ్గారెడ్డి
పీసీసి అధ్యక్ష పదవిని అడుగుతున్న..కానీ ఢిల్లీ చర్చలో నా పేరు ప్రస్తావన లేదు..నా పేరు లేకపోవడడం దురదృష్టకరమని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనను ఠాగూర్ చిన్న చూపు చూస్తున్నారు.. రాష్ట్రంలో ఉద్యమనేతగా బలమైన వ్యక్తిని గుర్తించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ని ఎదుర్కొన్న వ్యక్తిగా తనకు గుర్తింపు ఉందని తెలిపారు.

Mla Jaggareddy
MLA Jagga Reddy : పీసీసి అధ్యక్ష పదవిని అడుగుతున్నా..కానీ ఢిల్లీ చర్చలో నా పేరు ప్రస్తావన లేదు..నా పేరు లేకపోవడడం దురదృష్టకరమని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనను ఠాగూర్ చిన్న చూపు చూస్తున్నారు.. రాష్ట్రంలో ఉద్యమనేతగా బలమైన వ్యక్తిని గుర్తించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ని ఎదుర్కొన్న వ్యక్తిగా తనకు గుర్తింపు ఉందని తెలిపారు.
కేసీఆర్ ని ఆరోజుల్లో ఎదుర్కొన్న వారు ఎవరు లేరని, కానీ తాను మాత్రమే ఉద్యమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఇదంతా ఠాగూర్ కు తెలియకపోవడం తన దురదృష్టకరమని మరోసారి చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ ను రాజకీయంగా అడ్డుకోవాలన్నా.. ఆయన్ని గద్దె దించే మెడిసిన్ తన దగ్గర ఉందన్నారు. తాను కామెడీగా చెప్పట్లేదు.. వీహెచ్ కు ఫోన్లు చేసి బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. అందుకు తగ్గట్లుగా రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారాయన. పీసీసీ విషయంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా..క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా దాన్ని అనుసరిస్తానని చెప్పారు జగ్గారెడ్డి.
Read More :China Marriage Bureau:19వ పెళ్లి చేసుకుంటూ 18వ భర్తకు దొరికిపోయిన భార్య!