తిట్టింది వాస్తవమే – వివేకానంద, వీడియో వైరల్

MLA Vivekananda’s response on video viral : కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయ ఉద్యోగిని దూషించిన ఘటనపై వివరణ ఇచ్చారు స్థానిక MLA వివేకానంద. రెవెన్యూ సిబ్బందిని తాను తిట్టిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే రెవెన్యూ ఉద్యోగుల అవినీతి అక్రమాలను ఏ మాత్రం ఉపేక్షించనని తెలిపారు.
పేదలను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు వివేకానంద. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఓ బస్తీలో కరెంట్ మీటర్లను తీసుకెళ్లాడు వీఆర్‌వో శ్యామ్. తమ పట్ల వీఆర్‌వో దురుసుగా ప్రవర్తించాడని మహిళలు ఎమ్మెల్యే వివేకానందకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే.. శ్యామ్‌కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్యామ్ ఏడున్నావ్..నేను ఎమ్మెల్యేను మాట్లాడుతున్నానంటూ..ఎమ్మెల్యే వివేకానంద చెప్పారు. పాత ఇళ్ల వద్దకు ఎందుకు వెళుతున్నావు ? మీటర్లు ఎలా తీస్తావు అంటూ ప్రశ్నించారు. మహిళలను కొడుతున్నావా…అంటూ..ఏవో మాట్లాడారు. ఏం పీకుతున్నారు. గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తుంటే..ఏం చేస్తున్నావు ?
యూజ్ లెస్ ఫెలో..అంటూ తిట్టారు. పేదవాళ్ల ఇళ్లు కూలగొడుతారా ? రేపు పొద్దున ఉదయం 10గంటలకు ఆఫీసు రావాలని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.