MLC Kavitha : గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం.. ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను ఆమోదించడం ఆనవాయితీ అని తెలిపారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీగా మారినట్లు మరోసారి నిరూపితమైందన్నారు.

MLC Kavitha angry Governor Tamilisai
MLC Kavitha – Governor Tamilisai : నామినేటేడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. నామినేటేడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై దుమారం రేగింది. తమిళిసైపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ తమిళిసై తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మంగళవారం అసెంబ్లీ హాల్ లో ఐలమ్మ చిత్రపటానికి ఆమె నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. ఇన్నాళ్లు విధానాలు మాత్రమే ఉండే… కానీ ఇప్పుడు ఆమె విధానాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను ఆమోదించడం ఆనవాయితీ అని తెలిపారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీగా మారినట్లు మరోసారి నిరూపితమైందన్నారు.
Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించిన తమిళిసై
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ నుంచి ప్రకటన వెలువడిందన్నారు. రాజ్యాంగ బద్దంగా ఉన్న పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. గొప్ప ప్రజాస్వామిక దేశంగా ఎదిగే సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు మంచివి కావని అభిప్రాయపడ్డారు. కాగా, గవర్నర్ కోటాలో తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.