Kaushik Reddy : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కారుకు రోడ్డు ప్రమాదం.. ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో తప్పిన ప్రాణాపాయం
మానకొండూర్ మండలం ఖాదర్ గూడెం సమీపంలోకి రాగానే బైక్ ను తప్పించబోయి కౌశిక్ రెడ్డి కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది.

Kaushik Reddy (1)
Kaushik Reddy Car Hit Tree : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు బైక్ ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కౌశిక్ రెడ్డికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. సోమవారం ఉదయం హుజూరాబాద్ లో 2కే రన్ లో పాల్గొనేందుకు కౌశిక్ రెడ్డి కారులో కరీంనగర్ నుంచి వెళ్తున్నారు.
మార్గంమధ్యలో మానకొండూర్ మండలం ఖాదర్ గూడెం సమీపంలోకి రాగానే బైక్ ను తప్పించబోయి కౌశిక్ రెడ్డి కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. వెంటనే ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. బైక్ పై ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స కోసం అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వేరే వాహనంలో ప్రయాణించి హుజూరాబాద్ 2కే రన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
Dayakar Reddy Passed away: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత
హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కౌశిక్ రెడ్డికి డాక్టర్లు ఈసీజీ, స్కానింగ్, ఎక్స్ రే, ల్యాబ్ టెస్టులు నిర్వహించారు. గంట సేపు ఆస్పత్రిలో ఉంచుకున్న అనంతరం కౌశిక్ రెడ్డిని ఇంటికి పంపించారు. కారు బోల్తా పడటంతో ఆయన శరీరంలో అవయవాలు కుదుపునకు గురి కావడంతో ఒక రోజు మొత్తం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం తన కారు ప్రమాదానికి గురైందని పేర్కొన్నారు. కారులో తనతోపాటు
పీఏ, ఇద్దరు గన్ మెన్ లు , డ్రైవర్ ఉన్నారని తెలిపారు. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం నుంచి అందరం సురక్షితంగా బయటపడ్డామని వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.