నీళ్లు తాగటానికి వచ్చిన కోతిని ఉరివేసి చంపేసిన దుర్మార్గులు : మానవత్వమా నీవెక్కడ?

Monkey Hanged From Tree As Locals Cheer In Khammam 3 Held Arrested In Khammam Telangana
మనిషి మానవత్వం చచ్చిపోతోంది. జంతువుల ప్రాణాలను తీసేస్తూ ఆధునిక యుగం నుంచి అనాగరిక యుగంలోకి జారిపోతున్నాడు. గుక్కెడు నీళ్లు తాగటానికి వచ్చిన కోతిని దారుణంగా హింసించి ఉరివేసి చంపిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లాలోనూ ఓ వ్యక్తి తన ఇంటి ముందు తొట్టిలో నీరు తాగుతున్న కోతిని దారుణంగా హింసించాడు. అది గిలగిలా కొట్టుకుంటుంటే రాక్షసానందం పొందాడు. అంతటితో ఊరుకోకుండా ఆ మూగజీవికి తాడుతో ఉరి బిగించి చెట్టుకు వేలాడ దీసి ప్రాణాలు తీసిన ఘటనకు సబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసినవారంతా ఛీ..వీడసలు మనిషేనా? మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా? అని చీదరించుకుంటున్నారు.
వివారాల్లోకి వెళితే..ఖమ్మం జి ల్లాలోని వేంనూరు మండలం అమ్మపాలెం గ్రామంలో కొతులు జనావాసాల్లోకి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అమ్మపాలెంటోని వెంకటేశ్వరావు అనే వ్యక్తి ఇంటి వద్దకు ఓకోతి వచ్చింది. పాపం..దాహంతో గొంతు ఆరిపోయిందే..నీళ్లు తాగటానికి అక్కడే ఉన్న ఓ నీటి తొట్టి వద్దకు వెళ్లి అందులో నీళ్లు తాగింది. అలా నీళ్లు తాగుతు తాగుతూ.. అదుపుతప్పి తొట్టిలో పడిపోయింది. దీన్ని గమనించిన వెంకటేశ్వరరావుకు ఆ కోతిపై కోపం నషాళానికి అంటుంది. నాఇంటికొచ్చినీళ్లుతాగింది కాక..దాంట్లో పడి నీళ్లన్నీ పాడు చేసింది వెధవ కోతి అనుకుంటూ మరో ఇద్దరిని తీసుకొచ్చి ఆ కోతిని పట్టుకున్నాడు.
కోతి మెడకు తాడు కట్టి కట్టి కర్రలతో దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక కోతి అరుస్తూ..బాధతో విలవిల్లాడిపోయింది పాపం. అయినా వాళ్లకు ఏమాత్రం జాలి కలుగలేదు. అది అరుస్తున్నకొద్దీ మహదానందం పొందుతూ కొడుతూనే ఉన్నారు.
అలా కొట్టీ కొట్టీ..ఆకోతికి ఉరి బిగించి చంపేశారు. విలవిలలాడుతూ అది ప్రాణాలను వదిలింది. ఈ విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో నిందితులు వెంకటేశ్వరరావుతో పాటు అతనికి సహకరించిన జోసెఫ్ రాజు, గౌడెల్లి గణపతిలను అదుపులోకి తీసుకున్నారు. రూ. 25 వేల జరిమానా విధించారు. కోతులతో ఇబ్బంది ఉన్నంత మాత్రాన ఇలా మూగజీవాల ప్రాణాలను తీస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.