Bird Flu Virus: సండే రోజు షాకింగ్ న్యూస్.. అంతుబట్టని వ్యాధితో పదివేల కోళ్లు మృతి

ఆదివారం వచ్చిందంటే చికెన్ దుకాణాలు రద్దీగా కనిపిస్తాయి. సండే రోజు నాన్ వెజ్ తినేందుకు ..

Bird Flu Virus: సండే రోజు షాకింగ్ న్యూస్.. అంతుబట్టని వ్యాధితో పదివేల కోళ్లు మృతి

poultry farm

Updated On : March 9, 2025 / 9:59 AM IST

Bird Flu Virus: ఆదివారం వచ్చిందంటే చికెన్ దుకాణాలు రద్దీగా కనిపిస్తాయి. సండే రోజు నాన్ వెజ్ తినేందుకు ఎక్కువ మంది మాంసాహారులు ఇష్టపడతారు. దీంతో ఆరోజు చికెన్ విక్రయాలు అమాంతం పెరిగిపోతాయి. అయితే, గత నెల రోజులుగా కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా చికెన్ తినాలంటే చాలామంది భయపడుతున్నారు. గత వారం రోజులుగా బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్ తగ్గిపోయింది. దీంతో మళ్లీ చికెన్ దుకాణాల వద్ద క్యూ పెరుగుతుంది. అయితే, ఇవాళ (ఆదివారం) చికెన్ తిందామనుకున్న వారికి షాకింగ్ న్యూస్. అంతుపట్టని వ్యాధితో ఏకంగా పదివేళ్ల కోళ్లు చనిపోయాయి.

Also Read: గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్.. బ్యూటీఫుల్‌గా అమ్మాయితో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్.. తెల్లారితే పెండ్లి.. ఇంతలోనే..

మెదక్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ జిల్లాల్లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. తాజాగా ఏకంగా 10వేల కోళ్లు మృతిచెందడం ఆందోళన కలిగిస్తుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గ్రామాల్లో శనివారం 10వేల కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతిచెందాయి. గవ్వపల్లి, జంగరాయి గ్రామాల్లోని కోళ్ల ఫాంలలో కళ్ల ఎదుటే వ్యాధికి గురైన కోళ్లు మృతి చెందడంతో ఫాంల యాజమానులు, స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

 

మెదక్ జిల్లాలోని కోళ్ల ఫాంల నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు కూడా కోళ్లు సరఫరా అవుతుంటాయి. జిల్లాలో ఇటీవల, ప్రస్తుతం భారీ సంఖ్యలో కోళ్లు మృతిచెందడంతో మాంసాహారులు చికెన్ కొనుగోలు చేయాలంటే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో కోళ్ల ఫాం యాజమానులు కన్నీటి పర్యాంతమయ్యారు.

మృతిచెందిన కోళ్లను భూమిలో పూడ్చేశారు. రూ. లక్షల్లో నష్టం వాటిల్లిందని కోళ్ల ఫాం యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.