Mother Died: అమ్మ లేదని.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Mother Died: అమ్మ లేదని.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Mother Died With Heatstroke Son Leave His Life

Updated On : May 30, 2021 / 10:19 AM IST

Mother Died: తల్లి మరణవార్త తట్టుకోలేక తనువుచాలించాడో కుమారుడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కాటేదాన్ లో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని మధుబన్‌ కాలనీకి చెందిన గిల్ల శ్రీహరి(22) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తండ్రి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి రుక్మిణి (60) ఇంటివద్దనే ఉంటారు. శ్రీహరి తండ్రి క్యాన్సర్ తో బాధపడుతూ మూడేళ్ళ నుంచి ఇంటికే పరిమితమయ్యారు.

శ్రీహరి చిన్న చితక పనులు చేస్తూ ఓ వైపు చదువు.. మరోవైపు కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 22 న తల్లి రుక్మిణికి కరోనా సోకింది. 37 రోజులగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శనివారం రుక్మిణి మృతి చెందారు. తల్లి మరణవార్త విని తట్టుకోలేని కుమారుడు. స్నేహితుని బైక్ వేసుకొని బాంబే కాలనీలో ఓ చోట నిలిపేసి.. హూందాసాగర్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు శ్రీహరి. తనకు ఉన్న ఇల్లు అమ్మి తన తండ్రికి సగం. స్నేహితుడు సాయికిరణ్‌కు సగం ఇవ్వుమని పండుకు తెలిపాడు. తాను ఎవరి దగ్గర ఎంత తీసుకున్నానో వీడియోలో తెలిపాడు. ఎవరిని మోసం చెయ్యడం లేదని మీ డబ్బు మీకు ఇస్తారని తెలిపాడు.