Motkupalli Narasimhulu : టీఆర్ఎస్‌లోకి మోత్కుపల్లి.. కేసీఆర్ ప్రశంసలు!
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుపై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకున్నారు.

Motkupalli Narasimhulu To Join In Trs
Motkupalli Narasimhulu : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుపై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరారు. మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. మోత్కుపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారని, ఆయన తనకు అత్యంత సన్నిహితుడిగా పేర్కొన్నారు.
సమాజానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ప్రజా జీవితంలో ఆయనకు ఒక స్థానం ఉందని చెప్పారు. విద్యార్థి దశ తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించడమే కాకుండా అణగారిన ప్రజల తన గొంతు వినిపించారని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. నాతో అనేక సంవత్సరాలు కలిసి పని చేశారు. ఆయన వెంట ఎంతో అభిమానంతో వచ్చిన వారందరికీ హృదయపూర్వకమైన స్వాగతం తెలుపుతున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.
CM KCR : రేపు యాదాద్రికి కేసీఆర్…. ఆలయ పునః ప్రారంభం తేదీ ప్రకటించే అవకాశం
తెలంగాణ రాష్ట్ర సమాజం అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించిందన్నారు. ఒకప్పుడు నర్సింహులు కరెంట్ మంత్రిగా ఉన్నారు. ఆయనను కలిసినప్పుడు కరెంట్ బాధలు ఉన్నాయని చెప్పారు. ఎన్ని ట్రాన్స్‌ఫార్మర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసినట్టు కేసీఆర్ తెలిపారు. కరెంట్ కోసం తెలంగాణ ప్రాంతం ఎన్నో కష్టాలు పడిందన్నారు.
సోషల్ వెల్ఫేర్ మినిస్టర్‌గా మోత్కుపల్లి సేవలందించారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అనేక భయాలు కల్పించారన్నారు. తెలంగాణ వస్తే అభివృద్ధి ఉండదన్నారని తెలిపారు. తెలంగాణ కోసం మాయావతినే 13సార్లు కలిశానని కేసీఆర్ చెప్పారు. అన్నింటిని ఎదుర్కొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Weather Alert to Telangana: వెదర్ అలర్ట్.. రానున్న 3 రోజులపాటు తెలంగాణలో…!