Komatireddy Venkat Reddy: నా ఫోన్ రికార్డు పెట్టారని తెలుసు.. కానీ, నేను మాట్లాడిన విషయాలు కట్ చేశారు.. ఆడియో లీక్‌పై వెంకటరెడ్డి

చెరకు సుధాకర్‌పై పీడీయాక్ట్ పెడితే నేనే కోట్లాడానని గుర్తుచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నన్ను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పానని అన్నారు. మా వాళ్ళు చంపెస్తారేమోనని భయం‌తో మాత్రమే అలా చెప్పానని, ఈ విషయంలో అన్యదా భావించొద్దని ప్రజలను కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు.

Komatireddy Venkat Reddy: నా ఫోన్ రికార్డు పెట్టారని తెలుసు.. కానీ, నేను మాట్లాడిన విషయాలు కట్ చేశారు.. ఆడియో లీక్‌పై వెంకటరెడ్డి

Venkat Reddy

Updated On : March 6, 2023 / 12:48 PM IST

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీ నేత చెరుకు సుధాకర్‌పై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలతో కూడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం విధితమే. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆ ఆడియో టేపుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. 33ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ నా రాజకీయ ప్రత్యర్ధుల‌పై‌గాని, ఎవరిపై కూడా దూషించలేదని అన్నారు. నా శత్రువులను కూడా దగ్గరకు తీసే తత్వం నాదని చెప్పుకొచ్చారు. తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తా.. కేవలం, అవి నేను భావోద్వేగంతో చేసిన వాఖ్యలే అని అన్నారు. ఆ వ్యాఖ్యల్లో వేరే ఉద్దేశ్యం లేదని వెంకటరెడ్డి చెప్పారు. చదువుకున్న వ్యక్తి‌గా జనరల్ స్థానం అయిన నల్లగొండ మున్సిపాలిటీ ఛైర్మన్‌గా వెంకట్ నారాయణ గౌడ్‌కు అవకాశం ఇచ్చానని, నల్లగొండ మున్సిపాలిటీ మూడు సార్లు జనరల్ అయినప్పటికీ ఆ మూడు సార్లు పట్టుబట్టి బలహీన వర్గాల వారికి దక్కేలా చూశానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తుచేశారు.

Komatireddy Venkat Reddy : బూతులు తిడుతూ వారం రోజుల్లో చంపేస్తారంటూ బెదిరింపులు.. మరో వివాదంలో కోమటిరెడ్డి

నేను మాట్లాడే సమయంలో రికార్డు పెట్టారని నాకు తెలుసని, అయితే, ఆడియో లీక్ విషయంలో నేను మాట్లాడిన విషయాలు కట్ చేశారని, కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేశారని వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ‌లో జాయిన్ అయిన నాటినుంచి చెరకు సుధాకర్ నన్నుతిడుతున్నాడని, ఎందుకు తిడుతున్నారని అడిగానని వెంకటరెడ్డి చెప్పారు. నాపై చేసిన వాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే‌కు, ఇంఛార్జి ఠాక్రే ఫిర్యాదు చేశానని చెప్పారు. నన్ను వీడు, వాడు అని సంబోదించొచ్చా, వెంకట్ రెడ్డిని తిడితే నకిరేకల్ టికెట్ వస్తుందని అనుకుంటున్నారని, అలాచేయడం వల్ల పార్టీ టికెట్ రాదని, పార్టీ కోసం పనిచేస్తే టికెట్ వస్తుందని అన్నారు.

MP Komatireddy Venkat Reddy : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

చెరకు సుధాకర్‌పై పీడీయాక్ట్ పెడితే నేనే కోట్లాడానని గుర్తుచేసిన ఆయన.. నన్ను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పానని, మా వాళ్ళు చంపెస్తారేమోనని భయం‌తో మాత్రమే అలా చెప్పానని, ఈ విషయంలో అన్యదా భావించొద్దని ప్రజలను కోరుతున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. నన్ను సస్పెండ్ చేయాలని, దరిద్రులు అని అనడం వల్లే భాధతో మాట్లాడానని చెప్పారు.