MP Malothu Kavita : మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు 6 నెలల జైలు శిక్ష

మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా డబ్బులు పంచారని ఆమెపై గతంలో కేసు నమోదైంది.

MP Malothu Kavita : మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు 6 నెలల జైలు శిక్ష

Mp Malothu Kavita

Updated On : July 24, 2021 / 5:40 PM IST

MP Malothu Kavita : మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా డబ్బులు పంచారని ఆమెపై గతంలో కేసు నమోదైంది.

ఈ కేసుపై శనివారం విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.10 వేల రూపాయల జరిమానా విధించింది. మాలోతు కవితపై 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

కోర్టు విధించిన రూ.10 వేల జరిమానా చెల్లించిన కవిత.. బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు. కోర్టు వెంటనే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.