Komatireddy Rajagopal Reddy : రాజకీయాల నుంచి తప్పుకుంటా- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

క్విడ్ ప్రో కో తోనే తాను బీజేపీలో చేరినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిరూపించకపోతే మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి.. ముక్కు నేలకు రాయాలన్నారు.

Komatireddy Rajagopal Reddy : రాజకీయాల నుంచి తప్పుకుంటా- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

Updated On : October 8, 2022 / 8:24 PM IST

Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఉపఎన్నిక.. రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాల అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.. మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. క్విడ్ ప్రో కో తోనే తాను బీజేపీలో చేరినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. నిరూపించకపోతే మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి.. ముక్కు నేలకు రాయాలన్నారు.

కేంద్రం కాంట్రాక్టులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ టెండర్లు ఇచ్చినట్లు ఇవ్వరన్నారు రాజగోపాల్ రెడ్డి. 2014 తర్వాత కేసీఆర్ కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. మంత్రి కాకముందు జగదీశ్ రెడ్డి ఆస్తులు ఎన్ని, మంత్రి అయ్యాక జగదీశ్ రెడ్డి ఆస్తులు ఎన్నో లెక్క తీయాలన్నారు రాజగోపాల్ రెడ్డి. కౌరవ సైన్యంలా టీఆర్ఎస్ టీమ్ మునుగోడులో దిగిందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఓటమి భయంతో 14మంది మంత్రులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, ఇంచార్జ్ లు, అసెంబ్లీ కన్వీనర్లు హాజరయ్యారు. బీజేపీ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అర్వింద్ మీనన్ కూడా హాజరయ్యారు. మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై వీరు చర్చించారు. మునుగోడులో బీజేపీ విజయం కోసం కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు తరుణ్ చుగ్. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు.