Rajagopal Reddy Respond EC Notices : నగదు లావాదేవీలపై ఈసీ నోటీసులు.. స్పందించనున్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు పలువురు వ్యక్తులు, సంస్థలకు కోమటిరెడ్డి నగదు బదిలీ చేశారన్న ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసులు పంపింది. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు సమాధానం ఇవ్వాలని లేని పక్షంలో తగు నిర్ణయం తీసుకుంటామన్న ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో నగదు లావాదేవీలపై ఈసీ నోటీసులకి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించనున్నారు.

Rajagopal Reddy respond EC notices
Rajagopal Reddy Respond EC Notices : మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు పలువురు వ్యక్తులు, సంస్థలకు కోమటిరెడ్డి నగదు బదిలీ చేశారన్న ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసులు పంపింది. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు సమాధానం ఇవ్వాలని లేని పక్షంలో తగు నిర్ణయం తీసుకుంటామన్న ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో నగదు లావాదేవీలపై ఈసీ నోటీసులకి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించనున్నారు.
మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిన్న ఈసీ నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఫిర్యాదుపై ఈసీ దర్యాప్తు జరుపుతోంది. రూ.5 కోట్ల 24 లక్షల నగదు లావాదేవిలపై సమాధానం చెప్పాలని కోమటి రెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది. సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ నుంచి మునుగోడు లోని పలువురు వ్యక్తులు, సంస్థలకు నగదు బదులి చేసినట్లు ఈసీకి టిఆర్ఎస్ ఆధారాలతో పిర్యాదు చేసింది.
CEC Notices To Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ
అక్రమంగా నగదు బదిలీ చేశారన్న ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. కమిషన్ జారీ చేసిన నోటీసులను ఆలస్యం లేకుండా రాజగోపాల్ రెడ్డికి చేర్చాలని రిటర్నింగ్ అధికారి, సీఈఓ ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. బదిలీ చేసిన నగదు బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి ఓటర్లకు పంచేందుకే అని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ నుండి వివిధ వ్యక్తులకు రూ. 5,24,00,000 బదిలీ అయినట్లు ఈసీకి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ పిర్యాదు చేశారు.
అక్టోబర్ 29వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి సోమ భరత్ కుమార్ ఫిర్యాదు కాపీని పంపారు. ఈ నెల 18 నుంచి 29 మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా ద్వారా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 23 వేర్వేరు వ్యక్తులు/కంపెనీలకు నగదు బదిలీ చేసినట్లు ఫిర్యాదు చేశారు. నగదును విత్‌డ్రా చేసి ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.