Koosukuntla Prabhakar Reddy : మునుగోడు బైపోల్.. నేడు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని సీపీఎం, సీపీఐ బలపరిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి చండూరు పట్టణం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

Koosukuntla Prabhakar Reddy
Koosukuntla Prabhakar Reddy : మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని సీపీఎం, సీపీఐ బలపరిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి చండూరు పట్టణం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.
Bypoll in Munugodu : మునుగోడు బైపోల్ హడావుడి.. ఏ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్ ?
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. మునుగోడుకు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చిందో..? ర్యాలీలో నేతలు వివరించనున్నారు. బీఆర్‌ఎస్‌తోపాటు సీపీఎం, సీపీఐ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రానున్నాయి.