My Home Sayuk: రియల్టీ రంగంలో మైహోమ్ మరో రికార్డ్
రియల్టీ రంగంలో మైహోమ్ మరో రికార్డ్ సాధించింది. ప్రతిష్టాత్మకమైన సయుక్ ప్రాజెక్ట్ ప్రారంభించిన 24గంటల్లోనే 1125 ఫ్లాట్ల బుకింగ్స్ అయినట్లు యాజమాన్యం వెల్లడించింది. వీటి విలువ దాదాపు 1800 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది.

Myhome Sayuk
My Home Sayuk: రియల్టీ రంగంలో మైహోమ్ మరో రికార్డ్ సాధించింది. ప్రతిష్టాత్మకమైన సయుక్ ప్రాజెక్ట్ ప్రారంభించిన 24గంటల్లోనే 1125 ఫ్లాట్ల బుకింగ్స్ అయినట్లు యాజమాన్యం వెల్లడించింది. వీటి విలువ దాదాపు 1800 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది.
2016లో చేపట్టిన మైహోమ్ అవతార్ ప్రాజెక్టులో 24 గంటల్లో 1000 ఫ్లాట్ల అమ్మకంతో రికార్డ్ సాధించిన మై హోం. తన రికార్డును తానే మైహోమ్ సయుక్ తో బ్రేక్ చేసింది.
ఈ సందర్భంగా “సంస్థపై నమ్మకం ఉంటే కొనేందుకు కస్టమర్లు సిద్దంగా ఉంటారని” మైహోమ్ ఎండీ శ్యామ్ రావు వ్యాఖ్యానించారు.
Read Also: మై హోమ్ ది బెస్ట్.. మైనింగ్‌లో 5 స్టార్ రేటింగ్
మై హోంపై తమ నమ్మకాన్ని మరోసారి చూపిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారాయన.
కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా హైదరాబాద్ శివారులో తెల్లాపూర్ వద్ద మైహోమ్ సంస్థ చేపట్టిన ‘మైహోమ్ సయుక్’ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్ ను ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురువారం ప్రారంభించారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw