Sagar By Poll Result 2021 : సాగర్‌లో కారు జోరు.. టీఆర్ఎస్‌కు 4వేల ఓట్ల ఆధిక్యం
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో జరిగిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని రౌండ్లలోనూ కారు జోరు కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. వరుసగా తొలి ఐదు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. ఐదో రౌండ్ ముగిసే సరికి 4,334 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు.

Sagar By Poll Result 2021
Sagar By Poll Result 2021 : టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో జరిగిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని రౌండ్లలోనూ కారు జోరు కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. వరుసగా తొలి ఐదు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి మంచి ఆధిక్యాన్ని కనబరిచారు. ఐదో రౌండ్ ముగిసే సరికి 4,334 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోలయ్యాయి. నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్‌కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోలయ్యాయి.
నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. సాయంత్రం ఏడు గంటల వరకు అధికారికంగా విజేతను ప్రకటించే అవకాశం ఉంది.