Nagarjuna: ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని పరామర్శించిన నాగార్జున

ఆసుపత్రిలో తాను తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని కూడా పరామర్శించినట్లు నాగార్జున చెప్పారు.

Nagarjuna: ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్‌, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని పరామర్శించిన నాగార్జున

Nagarjuna

Updated On : December 13, 2023 / 9:23 PM IST

KCR: హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సినీనటుడు నాగార్జున పరామర్శించారు. ఆసుపత్రిలో కేసీఆర్‌‌తో కాసేపు మాట్లాడారు. కేసీఆర్ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు నాగార్జున.

అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. తనతో కేసీఆర్ బాగా మాట్లాడారని అన్నారు. తాను ఆసుపత్రిలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని కూడా పరామర్శించినట్లు నాగార్జున చెప్పారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. ఇదే ఆసుపత్రిలో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా పరామర్శించారు. కేసీఆర్‌తో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మరికొందరు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు.

Ponnam Prabhakar: రాష్ట్రంలో అన్ని శాఖలను బీఆర్ఎస్ ఇలా మార్చేసింది: మంత్రి పొన్నం ప్రభాకర్