Telangana : దుబాయ్‌లో నల్గొండ వాసి మృతి

ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన నల్గొండ (Nalgonda) జిల్లా వాసి అనారోగ్యంతో (Health Issues) మృతి చెందాడు. మదార్ గౌడ్ (50) మాలి దేశంలో బోర్‌వెల్ వాహనాల డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు

Telangana : దుబాయ్‌లో నల్గొండ వాసి మృతి

Telangana

Updated On : November 24, 2021 / 9:55 AM IST

Telangana :  ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లిన నల్గొండ (Nalgonda) జిల్లా వాసి అనారోగ్యంతో (Health Issues) మృతి చెందాడు. జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన మదార్ గౌడ్ (50)(madhar goud) మాలి(Mali) దేశంలో బోర్‌వెల్ వాహనాల డ్రిల్లర్‌గా పనిచేస్తున్నాడు. గత వారం స్వదేశానికి వస్తున్న సమయంలో దుబాయ్ ఎయిర్ పోర్టులో (Dubai International Airport) ఆరోగ్యం క్షిణించడంతో విమాన సిబ్బంది అతడిని అక్కడ ఆసుపత్రికి తరలించారు.

చదవండి : Nalgonda : అమెరికాలో నల్గొండ యువకుడు దుర్మరణం

ఐదు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మదార్ గౌడ్ మృతి మరణించాడు. మదార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి వస్తాడనుకున్న వ్యక్తి విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరగా తీసుకొచ్చేలా ప్రభుత్వం సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

చదవండి : Nalgonda : ఉద్రిక్తతలను పెంచిన బండి సంజయ్ టూర్