తెలంగాణ బీజేపీలో చేరిన మాజీ మంత్రి నెరేళ్ల, మాజీ ఎమ్మెల్యే పండరీ
సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి నెరేళ్ల ఆంజనేయులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరీ..

Nerella Anjaneyulu Joins BJP: ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి నెరేళ్ల ఆంజనేయులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరీ, జడ్పీటీసీ రాజీవ్ రాథోడ్, నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ నేత పిల్లి రామరాజు యాదవ్ మంగళవారం బీజేపీలో చేరారు. బీబీ పాటిల్, సైదిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో వీరంతా కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కండువాలతో వీరిని సాదరంగా ఆహ్వానించారు. డా. లక్ష్మణ్, సైదిరెడ్డి, ఇతర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం నరేంద్ర మోదీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మోదీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ పేరుతో ట్యాక్స్ వసూలు చేస్తోందని.. ఈ డబ్బును ఢిల్లీకి పంపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. తమ పార్టీలో చేరిన వారికి తగిన విధంగా గుర్తింపు ఉంటుందని హామీయిచ్చారు.
Also Read: బీజేపీ, బీఆర్ఎస్‌ను కార్నర్ చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్.. వర్కౌట్ అవుతుందా?