హైడ్రాకు కొత్త బుల్డోజర్లు.. కూల్చివేతలు, మరిన్ని భారీ యంత్రాల కోసం టెండర్లు..
బిడ్డర్లు తప్పనిసరిగా యంత్రాలను కలిగి ఉండాలని హైడ్రా సూచించింది.

New Bulldozers For Hydra : చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పడ్డ హైడ్రా.. అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తోంది. చెరువులను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కాగా కూల్చివేతలు, శిథిలాల తొలగింపు, కూల్చివేతలకు అవసరమైన అత్యాధునిక మరియు భారీ యంత్రాలను సమకూర్చునే దిశగా హైడ్రా కార్యచరణ చేపట్టింది. కాంట్రాక్ట్ పద్ధతిలో కూల్చివేతలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానిస్తోంది. ఈ నెల 27న యంత్రాల కోసం బిడ్డింగ్ ఆహ్వానించింది. ఆఫ్ లైన్ లో టెండర్లను ఆహ్వానించిన హైడ్రా.. తమ ప్రతిపాదనలను సీల్డ్ కవర్ లో సమర్పించాలని సూచించింది. ఏడాది కాల పరిమితితో బిడ్స్ ను స్వీకరిస్తోంది. సంస్థలు తమ నియమ, నిబంధనలను పాటించాలని షరతులు విధించింది హైడ్రా.
బిడ్డర్లు తప్పనిసరిగా యంత్రాలను కలిగి ఉండాలని హైడ్రా సూచించింది. 20 మీటర్ల ఎత్తులో ఉన్న ఏ నిర్మాణం అయినా.. కూల్చే విధంగా హైరీజ్ హైడ్రాలిక్ యంత్రాలు ఉండాలంది. జా క్రషర్, షీట్ కట్టర్, అడిషనల్ షీర్ కట్టర్, రాక్ బ్రేకర్, రెండు ఎక్సవేటర్లు, రెండు జేసీబీలు, రెండు మినీ ఎక్సవేటర్లు, రెండు రాక్ బేకర్లు కలిగుండాలంది హైడ్రా.
ఇక, జూన్ 26 నుంచి కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా.. ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను కూల్చేసింది. ఇప్పటివరకు ఆక్రమణకు గురైన 120 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది హైడ్రా.
Also Read : రియల్ ఎస్టేట్ ఆదాయంపై హైడ్రా ఎఫెక్ట్..! అయినా తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..