Telangana New Trains : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణకు కొత్తగా ఎనిమిది రైళ్లు.. ఈ రూట్లలోనే.. హైదరాబాద్లో ఆగే స్టేషన్లు ఇవే..
New Trains : రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది.
New Trains
- రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్
- తెలంగాణకు ఎనిమిది కొత్త రైళ్లు
- హైదరాబాద్లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి..
Telangana New Trains : రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు రైల్వే మంత్రిత్వశాఖ తెలంగాణ రాష్ట్రంకు కొత్త రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ లోని వివిధ స్టేషన్ల నుంచి ఈ కొత్త రైళ్లు వీక్లీ ట్రైన్స్ గా ప్రయాణికులకు సేవలందించనున్నాయి.
హైదరాబాద్ లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు సర్వీసులందించేలా ఈ నూతన వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ వారాంతపు ప్రత్యేక రైళ్లు హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపుర్, శ్రీగంగానగర్ వంటి ముఖ్యమైన గమ్యస్థానాలకు కనెక్టివిటీని పెంచుతాయని, దీంతో ప్రయాణీకులకు ప్రయాణం మరింత సులవు అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలను, కనెక్టివిటీని బలోపేతం చేసే దిశగా సహకారం అందిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్లకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ రైళ్ల వివరాలను ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
𝐌𝐚𝐣𝐨𝐫 𝐑𝐚𝐢𝐥 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐢𝐯𝐢𝐭𝐲 𝐁𝐨𝐨𝐬𝐭: 𝟖 𝐍𝐞𝐰 𝐓𝐫𝐚𝐢𝐧𝐬 𝐟𝐨𝐫 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚
To enhance passenger convenience, the Railway Ministry has approved 8 new weekly special trains from Kacheguda, Charlapalli, and Nampally stations in Hyderabad.… pic.twitter.com/jLzGixizo9
— G Kishan Reddy (@kishanreddybjp) April 21, 2026
కొత్త సర్వీసుల వివరాలు ఇవే..
♦ 17607/17608 నెంబరు: కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9.30 గంటలకు తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15 నుంచి ప్రారంభం కానుంది.
♦ 17601/17602 నెంబరు: కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ జులై 14 నుంచి ప్రారంభం కానుంది.
♦ 17047/17048 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 7 నుంచి ప్రారంభం కానుంది.
♦ 17441/17442 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 14 నుంచి ప్రారంభం కానుంది.
♦ 17443/17444 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15 నుంచి ప్రారంభం కానుంది.
♦ 17059/17060 నెంబరు: ప్రతి ఆదివారం రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 11 నుంచి ప్రారంభం కానుంది.
♦ 17067/17068 నెంబరు: ప్రతి సోమవారం సాయంత్రం 6.10 నిమిషాలకు చర్లపల్లి నుంచి భువనేశ్వర్ (ఒడిశా) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్.. మే 5 నుంచి ప్రారంభం కానుంది.
♦ 17079/17080 నెంబరు: ప్రతి శుక్రవారం రాత్రి 7.50 గంటలకు నాంపల్లి నుంచి జైపూర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.
