ఏ1 సాయి కాదు దేవరాజ్.. నటి శ్రావణి కేసు రిమాండ్ రిపోర్టులో కొత్త కోణం

సంచలనం రేపిన టీవీ నటి శ్రావణి(26) ఆత్మహత్య కేసు రిమాండ్ రిపోర్టులో కొత్త కోణం వెలుగుచూసింది. రిమాండ్ రిపోర్టులో ఏ1గా దేవరాజ్(24), ఏ2గా సాయికృష్ణను(28), ఏ3గా నిర్మాత అశోక్ రెడ్డిని చేర్చారు పోలీసులు. గతంలో ఏ3గా దేవరాజ్ పేరును చెప్పిన పోలీసులు ఇప్పుడు ఏ1గా చూపించారు. అలాగే.. గతంలో ఏ2గా ఉన్న అశోక్‌రెడ్డిని ఇప్పుడు ఏ3గా చేర్చారు. కేసులో 17 మంది సాక్షులను పోలీసులు విచారించారు. దేవరాజ్, సాయి, అశోక్ రెడ్డి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
ఈ కేసులో మూడో నిందితుడు ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి, సోమవారం(సెప్టెంబర్ 14,2020) విచారణకు వస్తానని చెప్పి ఆ తర్వాత సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసి మాయమయ్యారు. ఆయన పరారీలో ఉన్నారు. ఆయన కోసం వెతికిన ఎస్ఆర్ నగర్ పోలీసులు చివరికి బుధవారం(సెప్టెంబర్ 16,2020) పట్టుకున్నారు.
https://10tv.in/tv-actress-sravani-case-police-arrest-rx100-producer-ashok-reddy/
శ్రావణి కేసును విచారించిన పోలీసులు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ పెట్టారు.. కేసు వివరాలను స్వయంగా వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ వివరించారు. మొన్న ఆయన చెప్పినదానికి …రిమాండ్ రిపోర్టులో చూపించిన దానికి తేడా ఉంది.
https://10tv.in/actress-sravani-suicide-case-sravani-brother-sensational-comments/
ఈ కేసులో ఇప్పటికే సాయికృష్ణారెడ్డి(రియల్టర్, అనంతపురం), దేవరాజ్‌ను(కాకినాడ) పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అశోక్ రెడ్డి దొరికారు. ఈ ముగ్గురూ ఏదో ఒక సందర్భంలో పెళ్లి చేసుకుంటామని శ్రావణిని నమ్మించారని, ఆ తర్వాత యువతిని పలు విధాలుగా వేధించి హింసించారని పోలీసులు తెలిపారు.
ఈ ముగ్గురి బాధలు భరించలేకనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. చనిపోవడానికి ముందు శ్రావణి, దేవరాజ్‌తో చాలా సేపు మాట్లాడినట్లు కాల్ రికార్డు ద్వారా తెలిసిందన్నారు. గతంలో తనను వెంటాడి వేధిస్తున్నట్లు దేవరాజ్ పై శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసిందని డీసీపీ తెలిపారు.