Covid-19: కరోనా రోగుల్లో మూడోవంతు ఆసుపత్రుల్లోనే

Covid-19: కరోనా రోగుల్లో మూడోవంతు ఆసుపత్రుల్లోనే

Covid 19

Updated On : April 15, 2021 / 9:52 AM IST

Covid-19: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణలో రోజుకు 2000 వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. కరోనా సోకిన వారిలో మూడో వంతు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో కరోనా రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 1000 మంది ఉంటే ఇప్పుడు వీరి సంఖ్య 8 రేట్లు పెరిగింది.

ఇక రికవరీ రేటు కూడా తగ్గింది. 6.94 శాతం మేర రికవరీ రేటు తగ్గినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఓ వైపు కేసుల తీవ్రత పెరగడం మరోవైపు రికవరీ రేటు తగ్గడంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది. సెకండ్ వేవ్ మున్ముందు మరింత ఉగ్రరూపం దాల్చుతుందని వైద్యులు చెబుతన్నారు.

45 రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఫిబ్రవరి నెలలో 100 నుంచి 200 మధ్య కరోనా కేసులు నమోదయ్యేవి.. ఏప్రిల్ అయ్యేసరికి కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగింది. మార్చి మొదటి వారంలో యాక్టివ్‌ కేసులు 1,939 ఉండగా, అందులో 850 మంది ఐసోలేషన్‌లో ఉంటే మిగిలిన 1,089 మంది ఆసుపత్రుల్లో చేరారు.

అయితే తాజాగా మంగళవారం నాటి లెక్క ప్రకారం కరోనా యాక్టివ్‌ కేసులు ఏకంగా 25,459కు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. వీరిలో 16,892 మంది హోంఐసొలేషన్ లో ఉండగా 8,567 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2,292 మంది ఐసీయూలో ఉన్నారు. 4,233 మంది ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు.

రికవరీ రేటు కూడా దారుణంగా పడిపోయింది. ఫిబ్రవరిలో 98.80 శాతం రికవరీ రేట్ ఉండగా తాజాగా 91.86కి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. 20 పడకలు ఉన్న ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా సేవలు అందించేలా చెర్యలు చేపట్టింది. బుధవారం వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్.. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల బెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.