Covid Free India : దేశం కరోనా ఫ్రీ భారత్‌గా మారడం ఖాయం..
దేశ ప్రజలందరికి ఉచిత వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దేశ ప్రజల ఆరోగ్యం గురించి మోడీ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ నిర్ణయం అద్దం పడుతోందని అన్నారు.

Covid Free India
Covid Free India Bandi Sanjay : దేశ ప్రజలందరికి ఉచిత వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దేశ ప్రజల ఆరోగ్యం గురించి మోదీ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ నిర్ణయం అద్దం పడుతోందని అన్నారు. ఇది దేశ హితం కోసం ప్రధాని మరోసారి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బండి సంజయ్ కొనియాడారు. కరోనానుంచి దేశ ప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వ మొట్ట మొదటి ప్రాధాన్యతగా మోదీ ప్రకటించారని తెలిపారు.
ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అయినా సరే దేశ ప్రజలకు వ్యాక్సిన్ వేయించడమే తన లక్ష్యం అని మోదీ ప్రకటించడం ఆయన గొప్ప హృదయానికి నిదర్శనమన్నారు. కేంద్రం సపోర్ట్‌తో దేశంలో ఇప్పటికే మేడి ఇన్ ఇండియా ద్వారా రెండు వ్యాక్సిన్ లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలందరికి ఉచిత వ్యాక్సినేషన్ పై ప్రధాని తీసుకున్న నిర్ణయంతో దేశం కరోనా ఫ్రీ భారత్‌గా మారడం ఖాయమన్నారు.
కేవలం రాష్ట్రాలు కోరినందుకే 18 ఏళ్లు పైబడిన వాళ్ల కోసం ఇన్నాళ్లు 25 శాతం వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు అప్పగించారని తెలిపారు. కానీ, తెలంగాణ లాంటి రాష్ట్రాలు కేంద్రంపై విమర్శలు చేయడం తప్ప, తమ విధిని కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోయాయని విమర్శించారు. దేశంలో మొత్తం ప్రజలందరికి ఫ్రీ వ్యాక్సినేషన్ చేయిస్తామని కేంద్రమే నిర్ణయం తీసుకోవడం గొప్ప నిర్ణయమని బండ సంజయ్ తెలిపారు.