Three Corona Patients : హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక.. ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి

హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి చెందారు.

Three Corona Patients : హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక.. ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి

Oxygen Deprivation Kills Three Corona Patients At King Kothi Hospital In Hyderabad

Updated On : May 9, 2021 / 8:03 PM IST

King Kothi Hospital : హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక ముగ్గురు కరోనా పేషెంట్లు మృతి చెందారు. మరో 20 మంది ఆక్సిజన్ అందక ఇబ్బందిపడుతున్నారు.

జడ్చర్ల నుంచి కోఠి ఆస్పత్రికి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఇంకా రాకపోవడం వల్లే విషాదం చోటు చేసుకుంది. డ్రైవర్ దారి మరిచిపోవడంతో ఆక్సిజన్ సరఫరా ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.

ఆక్సిజన్ అయిపోయే వరకూ అధికారులు పట్టించుకోలేదు. చివరి నిమిషం వరకూ అధికారులు గుర్తించలేదు. అధికారుల నిర్లక్ష్యం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది.

హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోవడంతో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు విలవిలలాడారు. ఆక్సిజన్ అయిపోయిన విషయం చివరి వరకు గమనించని అధికారులు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టారు.

ఈ లోగానే ముగ్గురు ప్రాణం కోల్పోయారు. మరో 20 మంది ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఆస్పత్రిలో ఆక్సిజన్ పునరుద్ధరించారు.