Paddy Issue : రైతు కోసం, టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనతో దద్దరిల్లిన ఉభయసభలు
సేకరణపై విధాన నిర్ణయాన్ని ప్రకటించాలన్న డిమాండ్‌తో లోక్‌సభ, రాజ్యసభలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

Paddy Issue In Telangana Trs Mps Protest In Parliament
TRS MPs Protest : ధాన్యం రైతుల సమస్యపై టీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. వర్షాకాలం, యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. సేకరణపై విధాన నిర్ణయాన్ని ప్రకటించాలన్న డిమాండ్‌తో లోక్‌సభ, రాజ్యసభలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్ట ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేసినా.. ప్రభుత్వం స్పందించలేదు.
Read More : India Omicron : ఒమిక్రాన్ లక్షణాలివే…నిర్లక్ష్యం వద్దు
దీంతో సర్కారు వైఖరిని నిరసిస్తూ రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. 2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం ఉదయం ఉభయ సభల ప్రారంభమయ్యాయి. ధాన్యం సమస్యతో పాటు రాజ్యసభలో 12 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్నడిమాండ్‌తో పార్లమెంటులోని ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ధ టీఆర్‌ఎస్ ఎంపీలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రైతుల అంశాన్ని పార్లమెంట్ వేదికగా మరోసారి లేవనెత్తారు తెలంగాణ టీఆర్‌ఎస్ ఎంపీలు.. గడిచిన ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల పక్షాన నిలిచిందని లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు.
Read More : Cyberabad Police : దేశంలోనే భారీ సైబర్ క్రైమ్.. ముఠా గుట్టురట్టు.. 14మంది అరెస్ట్!
తెలంగాణ సర్కార్ రైతులకు అండగా నిలవడం వల్ల రాష్ట్రంలో వరిపంట ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదైందన్నారు.. తెలంగాణలో వరి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, దానితో పంట దిగుబడి కూడా పెరిగిందన్నారు. ఇప్పుడు ఇండియాలో వరిపంట ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు ఎంపీ నామా తెలిపారు. తెలంగాణ వరిరైతుల అంశాన్ని పరిష్కరించాలని, ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత అని, ఆ బాధ్యతలను కేంద్రం విస్మరిస్తోందని నామా అన్నారు.