సమస్యను పరిష్కరించకపోతే నా పదవికి రాజీనామా చేస్తా: పల్లా శ్రీనివాస్

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం ఏమి చేయట్లేదని ఆలోచన పెట్టుకోవద్దని అన్నారు.

సమస్యను పరిష్కరించకపోతే నా పదవికి రాజీనామా చేస్తా: పల్లా శ్రీనివాస్

Updated On : September 14, 2024 / 9:11 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద నిరసన దీక్ష చేస్తున్న కార్మిక నాయకులను గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు కలిశారు. సమస్యను పరిష్కరించకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గత ఐదు సంవత్సరాలుగా ఆందోళన చేస్తూనే ఉన్నామని తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం ఏమి చేయట్లేదని ఆలోచన పెట్టుకోవద్దని అన్నారు. తన ముందున్న లక్ష్యం విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడం లేదా తన పదవికి రాజీనామా చేసి కార్మికులతో పాటు కూర్చుని ఆందోళన చేయడమేనని చెప్పారు. కేంద్ర సర్కారు నుంచి ఆర్థిక సహాయం కోరేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ సమస్యపై చాలా కాలంగా కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

పది మంది ఎమ్మెల్యేల రక్షణకు ప్రభుత్వ పెద్దల భారీ వ్యూహం!