Passing Out Parade : ఆక్సిజన్, మందులు చేరవేయటంలో వాయుసేన సిబ్బంది సేవలు అమోఘం
కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆక్సిజన్,మందులు చేరవేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 3,800 గంటలకు పైగా సేవలు అందించారని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కే.ఎస్.బహదూరియా చెప్పారు.

Passing Out Parade Dungial Air Force Academy
Passing Out Parade : కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆక్సిజన్,మందులు చేరవేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 3,800 గంటలకు పైగా సేవలు అందించారని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కే.ఎస్.బహదూరియా చెప్పారు. ఈరోజు ఆయన దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైడ్ గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పెరేడ్‌కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
కోవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కొని కేడేట్లు శిక్షణ పూర్తిచేసుకున్నారని ఆయన అన్నారు. 161మంది కంబైడ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని…చరిత్రలో మొదటిసారిగా 20,500 గంటల ఫ్లయింగ్ ట్రైనింగ్ టైమింగ్ ఈ బ్యాచ్ క్యాడెట్లు చేశారని అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. రానున్న రోజులు మీ ధైర్య సాహసాలకు పరీక్ష….ఈ రోజునుండి దేశం కోసం త్యాగం చేయడమే మీ ధ్యేయం అని ఆయన కేడేట్లలో ఉత్సాహాన్ని నింపారు.