జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో జనసేనాని?

  • Published By: bheemraj ,Published On : November 26, 2020 / 02:28 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో జనసేనాని?

Updated On : November 26, 2020 / 2:52 PM IST

pawan kalyan ghmc election campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. పవన్ తో గ్రేటర్ హైదరాబాద్ లో ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. నిన్న నడ్డాతో జరిగిన పవన్ భేటీలో ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు పనవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది.



https://10tv.in/bjp-release-ghmc-elections-manifesto/
పవన్ ఒక్కరే ప్రచారం నిర్వహించడానికి బదులుగా అమిత్ షా, నడ్డా ప్రచార సభలో పాల్గొనే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు పవన్ రోడ్ షోల్లో పాల్గొంటే బీజేపీకి లాభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వ్యక్తిగత రోడ్ షోలకు పవన్ నో చెప్పినట్లు తెలుస్తోంది.



హైదరాబాద్ లో సెటిలర్స్ పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వారంతా పవన్ ప్రచారంతో ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ తో ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ సింగిల్ గా రోడ్ షోలు నిర్వహించడం కాకుండా నడ్డా, అమిత్ షా ఇద్దరూ ప్రచార సభలో పాల్గొనబోతున్నారు. ఆ సభల్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నట్లు కనిపిస్తోంది.



దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ తో చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఈ నెల 28, 29 తేదీల్లో జేపీ నడ్డా, అమిత్ షా హైదరాబాద్ లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

ఈ రెండు రోజుల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనేలా చేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ ప్రతిపాదనను జేపీ నడ్డా నిన్న పవన్ కళ్యాణ్ ముందు ఉంచినట్లు దానికి పవన్ కూడా అంగీకరించినట్లు సమాచారం.