Pencil: తీవ్ర విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన పెన్సిల్.. అక్కడ గుచ్చుకుని..

చిన్నారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Pencil: తీవ్ర విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన పెన్సిల్.. అక్కడ గుచ్చుకుని..

Updated On : December 24, 2025 / 10:06 PM IST

Pencil: మృత్యువు ఎప్పుడు ఎలా ఎవరిని పలకరిస్తుందో చెప్పడం చాలా కష్టం. మృత్యువు ఏ రూపంలోనైనా రావొచ్చు. దానికి చిన్న, పెద్ద అనే తేడా లేదు. తాజాగా స్కూల్ పిల్లలు వాడే పెన్సిల్ ఓ చిన్నారి పాలిట యమపాశంలా మారింది. ఆ విద్యార్థి ప్రాణం తీసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెన్సిల్ ఓ చిన్నారి ప్రాణం తీసింది. మేడారపు విహార్ వయసు ఆరేళ్లు.

ఓ ప్రైవేట్ స్కూల్ లో యూకేజీ చదువుతున్న విహార్ జేబులోని పెన్సిల్ పెట్టుకుని ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. జేబులోని పెన్సిల్ విహార్ ఛాతిలో గుచ్చుకుని తీవ్ర గాయమైంది. అంతే అక్కడే కుప్పకూలాడు. వెంటనే విహార్ ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే పిల్లాడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెన్సిల్ కారణంగా పిల్లాడి ప్రాణం పోయిందని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఊహించని రీతిలో పెన్సిల్ ఛాతిలో గుచ్చుకోవడం, తీవ్ర గాయం కావడం, పిల్లాడు చనిపోవడం.. చాలా షాకింగ్ ఉందంటున్నారు. ఏది ఏమైనా ఇకపై పెన్సిల్ తోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు. రాసుకునే సమయంలో తప్ప దాన్ని దగ్గర ఉంచుకోకపోవడమే సేఫ్ అంటున్నారు. ఆడుకునే సమయంలో పెన్సిల్ దగ్గర ఉంచుకోకపోవడమే మేలంటున్నారు. లేదంటే.. ఏ రకంగా పెన్నులకు క్యాప్స్ ఉంటాయో అదే విధంగా పెన్సిళ్లకు కూడా క్యాప్స్ పెట్టుకుంటే చాలా సేఫ్ అంటున్నారు.

Also Read: లక్కీ డ్రా ద్వారా సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ల కేటాయింపు.. అర్హులు వీరే.. ఇలా అప్లయ్ చేసుకోండి..