Bhatti Vikramarka : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో.. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదు : భట్టి విక్రమార్క
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత కనిపిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.

Bhatti Vikramarka
BRS Rule No Freedom : కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు బీఆర్ఎస్ పాలనలో స్వేచ్ఛ లేకుండా పోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అవుతున్నా తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొలగిస్తే తప్ప భవిష్యత్తు లేదని ఆదిలాబాద్ నుంచి నల్గొండ వరకు తాను నడిచిన ప్రతి గ్రామంలో ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. పీపుల్స్ మార్చ్ లో భాగంగా శనివారం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో బట్టి విక్రమార్క కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, కాంగ్రెస్ నేత దుబ్బాక నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ.. ఈ దేశానికి దశ- దిశ నిర్దేశం చేసినటువంటి అనేక భావజాలాలకు అడ్డా అని అభివర్ణించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టలేని దుర్మార్గపు దుస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలు నల్లగొండకు తెచ్చుకోవాలని ఆనాటి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అప్పటి సీఎంపై ఒత్తిడి చేసి నక్కలగండి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చారని గుర్తు చేశారు.
Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం : రేవంత్ రెడ్డి
నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి.. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇంత కాలం ఏం చేశారని ప్రశ్నించారు. ఏఎంఆర్ ప్రాజెక్టు కోసం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిధులు కేటాయించకుంటే రాజీనామాకు సిద్ధపడ్డారని చెప్పిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఎస్ఎల్బీసీ, నక్కలగండి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగార్జున సాగర్ నిర్మాణం చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డు, ఉపాధి హామీ పథకం ద్వారా పని, ఫీజు రియంబర్స్ మెంట్ ద్వారా ఉన్నత విద్య అందిస్తే… కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని విమర్శలు చేయడానికి సిగ్గుండాలని అని అన్నారు.
Minister Harish Rao : కిషన్ రెడ్డికి కన్ఫ్యూషన్ ఎక్కువ.. కాన్సంట్రేషన్ తక్కువ : మంత్రి హరీష్ రావు
అధికారం కోసం అర్రులు చాచేటటువంటి వ్యక్తి గుత్త సుఖేందర్రెడ్డి అని ఘాటు వ్యాఖ్యాలు చేశారు. పొద్దు తిరుగుడు పువ్వు మాదిరిగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లోకి మారినటువంటి వ్యక్తి కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలి అని మండిపడ్డారు. ప్రస్తుత జిల్లా మంత్రి నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ పౌరుషాన్ని గజ్వేల్ గఢీ దగ్గర పాతరేశారని విమర్శించారు. దశాబ్ది ఉత్సవాలు, సంబరాలు దేనికోసం? ఎందుకోసం జరుపుతున్నారు? అని ప్రశ్నించారు.
చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక గ్రామ పంచాయతీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకా? 9 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను దగా చేసినందుకా? అని నిలదీశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత కనిపిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.