ఈడీ ఎదుట విచారణకు హాజరైన మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో 2016 నుంచి 2022 వరకు అవకతవకలు జరిగినట్లు సమాచారం.

Malla Reddy
పీజీ మెడికల్ సీట్ల అక్రమాల కేసులో ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి ఈడీ పలు వివరాలు రాబట్టింది.
పలు మెడికల్ పీజీ సీట్లు అమ్ముకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతోనే ఈడీకి ఫిర్యాదులు అందడంతో విచారణ జరుగుతోంది. గత ఏడాది జూన్‌లో మల్లారెడ్డి ఇంటితో పాటు మెడికల్ కాలేజీ, ఆఫీసులపై ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది.
తెలంగాణలోని పది ప్రైవేట్ మెడికల్ కళాశాల్లో 45 సీట్లను బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు ఈడీ గుర్తించినట్లు తెలిసింది. దీనిపై ఈడీ వివరణ తీసుకుంటోంది. ఈడీ విచారణకు హాజరైన మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి వీటిపైనే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో 2016 నుంచి 2022 వరకు అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఫిబ్రవరి 2022లో కాళోజీ మెడికల్ యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో వరంగల్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. మెడికల్ కాలేజీ సీట్ల కుంభకోణంలో రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మాటలతో కాకుండా చేతలతోనే మా ప్రభుత్వం పనితనం చూపుతోంది: పవన్ కల్యాణ్