Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సిట్ ముందుకు ఆ ముగ్గురు బీజేపీ ఎంపీలు..
బీజేపీ నేతల అనుచరుల ఫోన్లు సైతం ట్యాపింగ్ అయినట్లు గుర్తించింది. బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు సిట్ సమాచారం సేకరించింది.

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు. ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్ రావులు సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఈ ముగ్గురి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. బీజేపీ నేతల అనుచరుల ఫోన్లు సైతం ట్యాపింగ్ అయినట్లు గుర్తించింది. బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు సిట్ సమాచారం సేకరించింది. బీజేపీ నేతల కదలికలను ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావు టీమ్ తెలుసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే చాలామంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని అమెరికా నుంచి ఇండియాకు తీసుకు రావడం జరిగింది. ఇప్పటికే మూడుసార్లు ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారించారు.
Also Read: ‘కుజ కేతు యోగం.. విమాన ప్రమాదాలే కాదు ఇంకా ఎన్నో.. ఈ రాశుల వారు బీ కేర్ ఫుల్’
ఈ కేసులో నిందితుల దగ్గరి నుంచి తీసుకున్న కొంత ఎవిడెన్స్ తో పాటు కొంత కాల్ డేలా ఆధారంగా.. వారు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? ఎవరెవరితో సంబంధాలు ఏర్పరచుకున్నారు? ఎవరెవరిని ఇబ్బందులకు గురి చేశారు? అన్నదానిపై పూర్తిగా ఇప్పటికే సిట్ అధికారులు కాల్ డేటాను సేకరించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ని ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సాక్షిగా సిట్ అధికారులు పిలిచారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.
ఇక బీజేపీ ఎంపీలు ఈటల, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. నిందితుల కాల్ డేటాలో వీరి నెంబర్లు ఉండటంతో వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా సిట్ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. 2023 నవంబర్ 23 తర్వాత సార్వత్రిక ఎన్నికల నుంచి వీరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్ రావుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. వీరిని కూడా విట్నెస్ లుగా ప్రకటించే అవకాశం ఉంది.