‘కుజ కేతు యోగం.. విమాన ప్రమాదాలే కాదు ఇంకా ఎన్నో.. ఈ రాశుల వారు బీ కేర్ ఫుల్’
"ఎరుపు రంగుకు సంబంధించిన వాహనాలు జాగ్రత్తగా నడపాలి. అది కారైనా, విమానమైనా, రైలైనా సరే" అని తెలిపారు.

సింహరాశిలో కుజుడు, కేతువు కలిసి ఉండడం వల్ల రాబోయే వంద రోజులపాటు వివిధ రాశుల వారికి భారీగా నష్టాలు, సమస్యలు ఎదురవుతాయని జ్యోతిష్యుడు వేణుస్వామి అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు వీడియో రూపంలో మాట్లాడారు.
“విశ్వావసు నామ సంవత్సరంలో జరిగే సంచలనాల గురించి ఇప్పటికే చెప్పాను. విమాన ప్రమాదాలు, సునామీ హెచ్చరికలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. ఇప్పుడు సింహరాశిలో కుజుడు, కేతువు కలిసి ఉండడం వల్ల వివిధ రాశుల వారికి భారీగా నష్టాలు, సమస్యలు ఎదురవుతాయి.
ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. 2025 సెప్టెంబరు 1 వరకు సమస్యలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా సింహ, కన్యా, మకర, మీన, వృషభ రాశి వారికి సమస్యలు వస్తాయి. ఆర్థిక, నరాల, లీగల్ సమస్యలు, తల్లికి అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టాలు వాహన ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి.
Also Read: “అయ్యబాబోయ్.. హోటల్ బయట భారీ మొసలి, షాకైన పర్యాటకులు.. వీడియో వైరల్
ప్రకృతిపరంగా విమాన, అగ్ని, వాహన, ప్రయాణ ప్రమాదాలు, భూకంపాలు, సునామీ, ఇంటర్నెట్ ఆగిపోవడం, సామాజిక మాధ్యమాల్లో టెక్నికల్ ఇష్యూలు ఎదురవుతాయి. ఎరుపు రంగుకు సంబంధించిన వాహనాలు జాగ్రత్తగా నడపాలి.
అది కారైనా, విమానమైనా, రైలయినా సరే. కేతువుకి సంబంధించిన జపాలు చేయండి. నవగ్రహాలను పూజించండి. కుజుడు, కేతువులకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించండి. జపాన్ని చేయించుకోండి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఇవి చేస్తే సమస్యల నుంచి బయటపడతారు” అని వేణుస్వామి అన్నారు.
View this post on Instagram