Himanshu Rao : తెలంగాణ పంట పొలాల్లో నాకు కనిపించే రూపం..అంటూ కేసీఆర్ మనవడి ట్వీట్ వైరల్

మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా హిమాన్షు పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Himanshu Rao : తెలంగాణ పంట పొలాల్లో నాకు కనిపించే రూపం..అంటూ కేసీఆర్ మనవడి ట్వీట్ వైరల్

Himanshu Rao

Himanshu Rao : తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా హిమాన్షు పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Himanshu Rao: ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ ఇచ్చిన కల్వకుంట్ల హిమాన్షు.. అప్పట్లో కన్నీళ్లు వచ్చాయని కామెంట్స్

హిమాన్షు రావు ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారు. ఓవైపు చదువుతో పాటు సోషల్ మీడియాలో పలు విషయాలను షేర్ చేస్తుంటారు. రీసెంట్‌గా హిమాన్షు పచ్చని పొలాల మీద సీఎం కేసీఆర్ రూపం కనిపిస్తున్నట్లు ఉండే ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసారు. ‘కొంతమంది తమకు నచ్చిన విగ్రహాలను ద్వీపాలలో చూస్తారు.. మరికొందరు ఎడారులలో చూస్తారు.. కానీ నేను తెలంగాణలో ప్రతి వ్యవసాయ క్షేత్రంలో చూసే రూపం’ అనే శీర్షికతో ఈ పోస్ట్ పెట్టారు.

KTR Son Himanshu: సీఎం కేసీఆర్ మనవడి చొరవ.. కొత్తరూపు సంతరించుకున్న కేశవనగర్ సర్కార్ స్కూల్

హిమాన్షు ట్వీట్ వైరల్ అవుతోంది. చాలామంది నెటిజన్లు స్పందించారు. ‘చాలా చక్కగా అభివర్ణించావు’ అంటూ కొందరు ప్రశంసిస్తే కొందరు విమర్శలు గుప్పించారు. ఏది ఏమైనా హిమాన్షు ట్వీట్ వైరల్ అవుతోంది. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ స్కూల్‌లో ఇంటర్ పూర్తి చేసిన హిమాన్షు తరువాత చదువుల కోసం అమెరికాలో ఉన్నారు.