అచ్చంపేటలో దారుణం..మృతదేహాన్ని పీక్కుతిన్న పందులు

  • Published By: bheemraj ,Published On : December 13, 2020 / 04:29 PM IST
అచ్చంపేటలో దారుణం..మృతదేహాన్ని పీక్కుతిన్న పందులు

Updated On : December 13, 2020 / 4:34 PM IST

pigs eats deadbody : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ కేంద్రంలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిద్రిస్తున్న వృద్ధురాలు అక్కడే చనిపోయింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న మృతదేహాన్ని పందులు పీక్కుతిన్నాయి. మృతదేహాన్ని పందులు పీక్కుతినడం స్థానికులను కలచివేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అచ్చంపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వృద్ధురాలు భిక్షాటన చేస్తూ అక్కడే రాత్రిళ్లు ఉటుంది. రోజూ లాగే
ఉదయం భిక్షాటన చేసి పడుకున్న వృద్ధురాలు నిద్రలోనే మృతి చెందింది. దీంతో అక్కడున్న పందులు వృద్ధురాలి మృతదేహాన్నీ పీక్కుతున్నాయి.

చలికావడంతోపాటు చలి తీవ్రత అధికంగా ఉండటంతో అధికమవ్వడంతో వృద్ధురాలు మృతి చెంది ఉండవచ్చని స్థానికులు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది వృద్ధురాలి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.