Plastic Rice : రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ రైస్ కలకలం

రేషన్‌ డీలర్‌ సరఫరా చేసే బియ్యంలో కిలోకు వంద గ్రాముల వరకు ప్లాస్టిక్‌ రైస్‌ కలిసి ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బియ్యంతో చేసిన అన్నం తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.

Plastic Rice : రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ రైస్ కలకలం

Plastic Rice

Updated On : May 15, 2022 / 6:15 PM IST

Plastic rice : రేషన్‌ షాప్ లో ప్లాస్టిక్‌ రైస్‌ కలకలం రేపింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురంలో రేషన్‌ బియ్యంలో ప్లాస్టిక్‌ రైస్‌ కలుస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. రేషన్‌ డీలర్‌ సరఫరా చేసే బియ్యంలో కిలోకు వంద గ్రాముల వరకు ప్లాస్టిక్‌ రైస్‌ కలిసి ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బియ్యంతో చేసిన అన్నం తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.

Plastic Rice In RationDepots: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం

వండిన తర్వాత అన్నం మెత్తపడి బంకలాగా సాగుతోందంటున్నారు. ఇదే విషయాన్ని రేషన్‌ డీలర్‌ దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు. ప్లాస్టిక్‌ రైస్‌పై ప్రజల్లో అపోహ ఉందని రేషన్‌ డీలర్‌ అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోర్టిఫైడ్‌ రైస్‌ అందిస్తున్నామని చెప్పారు.