Plastic Rice In RationDepots: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం

రేషన్ షాపుల్లో పంపిణీ చేసిన బియ్యం వివాదాస్పదమైంది. రేషన్ బియ్యం తిన్న తర్వాత పిల్లలు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారని మహిళలు చెబుతున్నారు. (Plastic Rice In RationDepots)

Plastic Rice In RationDepots: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం

Plastic Rice

Plastic Rice In RationDepots: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రేషన్ షాపుల్లో పంపిణీ చేసిన బియ్యం వివాదాస్పదమైంది. రేషన్ బియ్యం తిన్న తర్వాత పిల్లలు అస్వస్థతకు గురయ్యారని, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారని మహిళలు చెబుతున్నారు. రేషన్ షాపుల్లో పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిపారని వారు ఆరోపించారు. వేడి నీళ్లలో ఆ బియ్యాన్ని వేసి చూపిస్తున్నారు.

రేషన్ లబ్దిదారులు దుకాణాల ఎదుట ఆందోళనకు దిగడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటిన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. భద్రాచలంలోని రేషన్ దుకాణాల్లో బియ్యం శాంపుల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు.(Plastic Rice In RationDepots)

Plastic Rice in ration depot in Bhadradri Kothagudem

Plastic Rice in ration depot in Bhadradri Kothagudem

అయితే, రేషన్ లో కలిసినవి ప్లాస్టిక్ బియ్యం కావని, ఫోర్టిఫైడ్ బియ్యం అయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణ బియ్యంలో కెన్నెల్ రైస్ కలపడం వల్ల కొంత పోషకాహార విలువలు పెరుగుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.

రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం పంపిణీ

బయ్యారంలో రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం?
కొన్నిరోజుల క్రితం మహబూబాబాద్ లోనూ ఇలాంటి కలకలమే రేగింది. ప్రభుత్వ చౌకదుకాణం నుంచి సరఫరా అయిన బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం కలిసిందన్న అనుమానాలు ఆందోళనకు గురిచేశాయి. బయ్యారంలోని పీహెచ్‌సీ ఏరియాలో నివాసం ఉండే పద్మ రేషన్ షాపు నుంచి పది కిలోల బియ్యం తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ బియ్యాన్ని వండేందుకు నానబెట్టిన సమయంలో ప్లాస్టిక్‌తో కూడిన బియ్యం నీళ్లలో పైకి తేలాయి.(Plastic Rice In RationDepots)

దీంతో ఆ బియ్యాన్ని పూర్తిగా గమనించగా ప్లాస్టిక్‌ బియ్యంగా కనిపించాయి. దీంతో ఆమె షాక్ కి గురైంది. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంలో ప్లాస్టిక్‌ బియ్యం ఎలా వచ్చాయి? అనే ప్రశ్న తలెత్తింది. కాగా, అధికారులేమో అది ప్లాస్టిక్ బియ్యం కాదని చెబుతున్నారు. అయితే, ఇప్పటికైనా చౌకదుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం నాణ్యతపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

అనంతలోనూ ప్లాస్టిక్ బియ్యం కలకలం..
తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఇలాంటి అనుమానాలు కలకలం రేపాయి. అనంతపురం జిల్లాలో రేషన్‌లో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేయడం కలకలం రేపింది. ఈ బియ్యంపై అవగాహనలేని సామాన్యులు ప్లాస్టిక్‌ బియ్యంగా భావించి ఆందోళన చెందారు. అనంతపురం రూరల్‌ మండలం కందుకూరు, పూలకుంట, గార్లదిన్నె మండలం మర్తాడులో రేషన్‌లో ఎన్నడూ లేని విధంగా ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేశారు.

Free Ration Scheme : పేదలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచిత రేషన్ పథకం మరో 6 నెలలు పొడిగింపు

అలా పంపిణీ చేసిన రేషన్‌లో ప్లాస్టిక్‌ బియ్యం వచ్చిందన్న ప్రచారం జరిగింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసిన బియ్యంలోనూ ఈ తరహా బియ్యం కనిపించింది. లబ్ధిదారులు రేషన్‌ను ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత ఎందుకైనా మంచిదని, భిన్నంగా ఉన్న బియ్యాన్ని వేరుచేశారు. అయితే, అది ప్లాస్టిక్‌ బియ్యం కాదని, పోషక విలువలుండే ఫోర్టిఫైడ్‌ బియ్యమని రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు.