కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో భారత్ బయోటెక్ పురోగతి : ప్రధాని మోడీ

  • Published By: bheemraj ,Published On : November 28, 2020 / 04:20 PM IST
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో భారత్ బయోటెక్ పురోగతి : ప్రధాని మోడీ

Updated On : November 28, 2020 / 4:35 PM IST

PM modi Congratulations Bharat Biotech : ప్రధాని మోడీ భారత్ బయోటెక్ ను సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్షించారు. కోవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించారు. కోవాగ్జిన్ పురోగతిని శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. భారత్ బయోటెక్ సందర్శన అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.



స్వదేశీ కోవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ బృందానికి అభినందనలు తెలిపారు. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ కలిసి వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ట్రయల్స్ లో భారత్ బయోటెక్ పురోగతి సాధించిందని చెప్పారు.



https://10tv.in/two-wheeler-owners-to-now-use-only-bis-certified-helmets-govt-issues-notification/
భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఐసీఎంఆర్‌ సంయుక్తంగా కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. పూణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ అందించిన కరోనా స్ట్రెయిన్‌తో కొవాగ్జిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటికే తొలి రెండు దశల ప్రయోగాలు పూర్తయి, సానుకూల ఫలితాలు వెలువడ్డాయి.



దీంతో మూడో దశ క్లినికల్‌ టెస్ట్‌లు ప్రారంభమయ్యాయి. మూడో దశలో ఏకంగా 26 వేల మందిపై ప్రయోగాలు చేస్తోంది భారత్‌ బయోటెక్‌. ఈ వ్యాక్సిన్‌ సక్సెస్‌ అయి అనుమతులు వస్తే ఏటా 30 కోట్ల డోసుల ఉత్పత్తి జరుగనుంది.