PM Telangana Tour Postponed : తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన వాయిదా..
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదాపడింది. జనవరి (2023) 19న హైదరాబాద్ కు రావాల్సిన మోడీ పర్యటన వాయిదా పడింది. సికింద్రాబాద్ లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ జనవరి 19న రావాల్సి ఉంది. ఈ కార్యక్రమంతో బీజేపీ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ పర్యటన వాయిదా పడింది.

PM Modi Telangana Tour Postponed
PM Modi Telangana Tour Postponed : ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదాపడింది. జనవరి (2023) 19న హైదరాబాద్ కు రావాల్సిన మోడీ పర్యటన వాయిదా పడింది. సికింద్రాబాద్ లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ జనవరి 19న రావాల్సి ఉంది. ఈ కార్యక్రమంతో బీజేపీ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ పర్యటన వాయిదా పడింది. ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లను కూడా తెలంగాణ బీజేపీ నేతలు ముమ్మరంగా చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలతోపాటు పలు రాజకీయ కార్యక్రమాలు కూడా మోదీ పర్యటనలో భాగంగా ఫ్లాన్ చేశారు. కానీ ఈ కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. ప్రధాని మోడీ వేరే ప్రొగ్రామ్స్ వల్ల తెలంగాణ పర్యటన వాయిదా పడిందని తెలిపారు. ఈ పర్యటన వాయిదా పడింది తప్ప క్యాన్సిల్ కాలేదని త్వరలోనే ఈ పర్యటన తేదీని ఖరారు చేసిన వెల్లడిస్తామని తెలిపారు. త్వరలోనే ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపారు.
కాగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ మూడు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. 19న సికింద్రాబాద్‌లో వందే భారత్ రైలును ప్రారంభించడం, అలాగే సికింద్రాబాదు- విజయవాడ మధ్య రైల్వే ఆధునీకరణ పనులకు శంఖుస్థాపన చేయటంతో పాటు కాజీపేట్‌లో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది.అధికారికంగా ఈ కార్యక్రమాలతోపాటు రాజకీయ పరంగా బీజేపీ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేస్తున్న భారీ బహిరంగసభలో కూడా ప్రధాని పాల్గొనాల్సి ఉంది. ఈ సభకు సంబంధించి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రదాని మోదీ పర్యటన వాయిదా పడడంతో ఈ పనులన్నీ వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రధాని పర్యటన ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని బండి సంజయ్ తెలిపారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా బీజేపీ పక్కాగా వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీ పెద్దలు సైతం తెలంగాణాలో అధికారం సాధించటానికి తరచు రాష్ట్రంలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో తనకున్న సీట్లను పెంచుకుంటూనే మరోపక్క అధికారం కోసం నేతలు కృషి చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో అవలంభించిన విధానాలతోనే తెలంగాణలో పాటించాలని భావిస్తోంది. దీంట్లో భాగంగనే గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో డిజిటల్ దూకుడుతో సక్సెస్ సాధించిన బీజేపీ తెలంగాణలో కూడా అదే డిజిటల్ తో విజయం సాధించాలనుకుంటోంది.
ఈక్రమంలో తెలంగాణలో సరళ్ యాప్ సమ్మేళనాలు చేపట్టింది బీజేపీ. తెలంగాణాలోని 34,867 బూత్ లు ఈ సరళ్ యాప్ లో అనుసంధానం చేయబడ్డాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో వర్చువల్ గా బీజేపీ బూత్ స్థాయి సమ్మేళనాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కమిటీ సభ్యులను ఉద్ధేశించి ప్రసంగించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా ఈ సరళ్ యాప్ లను బీజేపీ అధిష్టానం విడుదుల చేసింది.