Saidabad Rape : రేపిస్ట్ రాజు కోసం పోలీసుల ముమ్మర వేట
సైదాబాద్ చిన్నారి రేప్, హత్య కేసులో నిందితుడు రాజు ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర వేట కొనసాగుతోంది. నిందితుడు రాజు చౌటుప్పల్ దగ్గర కనిపించినట్లు తెలుస్తోంది.

Accused (1)
child rape and murder : సైదాబాద్ చిన్నారి రేప్, హత్య కేసులో నిందితుడు రాజు ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర వేట కొనసాగుతోంది. నిందితుడు రాజు చౌటుప్పల్ దగ్గర కనిపించినట్లు తెలుస్తోంది. పంతంగి టోల్‌గేట్ దగ్గర సీసీ కెమెరాల్లో రాజు వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు వెళ్లేలోగానే రాజు పరారైనట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. 70 టీమ్‌లను ఏర్పాటు చేసిన పోలీసులు.. రాజు కోసం జల్లెడ పడుతున్నారు.
వెయ్యి మంది పోలీసులు రాజు కోసం గాలిస్తున్నారు.. నిందితుడు స్మార్ట్ ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియా సైట్లు యూజ్ చేయకపోవడం వల్ల కనుక్కొవడం కష్టంగా మారింది. ప్రస్తుతం రాజును గుర్తించడం కోసం సీసీ కెమెరాలపైనే పోలీసులు ఆధారపడుతున్నారు. వందల సీసీ కెమెరాల ఫీడ్‌ను జల్లెడ పడుతున్నారు. నిందితుడు రాజుపై పది లక్షల రూపాయల క్యాష్ రివార్డు ప్రకటించారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్.
Saidabad Rape: సైదాబాద్‌లో పవన్ కళ్యాణ్.. ఆ బాధ్యత ప్రభుత్వానిదే
చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఆనవాళ్లు విడుదల చేశారు పోలీసులు. నిందితుడి వయస్సు 30 ఏళ్లు ఉంటాయని, ఎత్తు 5.9 అడుగులు ఉండొచ్చని ప్రకటన విడుదల చేశారు. రాజుకు పొడవాటి జుట్టు ఉంటుందని, పిలకకు రబ్బర్ బ్యాండ్ ముడి వేస్తాడని పేర్కొన్నారు. నెత్తిన టోపీ పెట్టుకుంటాడని, మెడలో ఎర్రని కండువా వేసుకుంటాడని స్పష్టం చేశారు.
రాజు రెండు చేతులపైనా మౌనిక పేరుతో టాటూలు ఉన్నాయన్నారు. తరచూ మద్యం తాగే అలవాటు ఉందని, మద్యం తాగాక బస్టాండ్‌లలో పడుకునే అలవాటు రాజుకు ఉందని ఆనవాళ్ల జాబితాలో ప్రస్తావించారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పల్లకొండ రాజు కనిపిస్తే 94906-16366, 94906-16627 నంబర్లకు కాల్ చేయాలని ప్రకటించారు.
Saidabad Rape : సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ షర్మిల దీక్ష
సైదాబాద్… సింగరేణి కాలనీలో నివాసముండే రాజు ఈ నెల 9వ తేదీ సాయంత్రం పాపను అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు. తన ఇంట్లోనే పాప మృతదేహాన్ని ఉంచి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు తప్పించుకుని తిరుగుతూనే ఉన్నాడు.