Vamanarao Murder Case : వామనరావు దంపతుల హత్య కేసుతో నాకు సంబంధం లేదు : పుట్టమధు
వామనరావు దంపతుల హత్య కేసుతో తనకు సంబంధం లేదని పుట్టమధు అన్నారు. రాజకీయంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

Police Are Investigating Puttamadhu In The Vamana Rao Couple Murder Case
Vamana Rao couple murder case : వామనరావు దంపతుల హత్య కేసుతో తనకు సంబంధం లేదని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అన్నారు. రాజకీయంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వామనరావుకు చాలా మందితో శత్రుత్వం ఉందని…. వ్యక్తిగత కక్షలతోనే కుంటశ్రీను, బిట్టు శ్రీనులు వామనరావును హత్య చేసి ఉండవచ్చన్నారు.
పాత స్నేహితులను కలిసేందుకే 9 రోజుల పాటు బయటకు వెళ్లానని పుట్టమధు చెప్పారు. వామనరావు దంపతుల హత్య కేసు విచారణలో భాగంగా రామగుండం కమిషనరేట్ పోలీసులు పుట్టమధును విచారిస్తున్నారు.
మరోవైపు వామనరావు దంపతుల హత్య కేసులో పోలీసు విచారణ ఎదుర్కొంటున్న పుట్ట మధు కోవిడ్ టీకా వేయించుకున్నారు. మంథనిలోని సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు.