Saroor Nagar : సరూర్‌నగర్‌ పెంపుడు తల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

తల్లిని చంపేసి.. నల్లమలలో ఉన్న తన స్నేహితుల వద్ద తలదాచుకునేందుకు వచ్చాడు. సాయితేజ ఫ్రెండ్‌ శివతో గొడవ జరగడంతో.. సాయితేజను మల్లెలతీర్థం ఆలయం సమీపంలో శివ బండరాయితో కొట్టి చంపాడు.

Saroor Nagar : సరూర్‌నగర్‌ పెంపుడు తల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

Saroor Nagar (1)

Updated On : May 13, 2022 / 6:50 PM IST

Saroor Nagar : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్‌ పెంపుడు తల్లి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కలకలం సృష్టించిన ఈ కేసులో.. రెండు సంఘటలు జరిగాయి. వారం క్రితం పెంపుడు తల్లిని చంపి.. బంగారం, డబ్బుతో పరారైన సాయితేజ కూడా హత్యకు గురయ్యాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ నల్లమల అడవుల్లో.. నిన్న పెంపుడు కొడుకు సాయితేజ డెడ్‌బాడీని అమ్రాబాద్ పోలీసులు గుర్తించారు.

తల్లిని చంపేసి.. నల్లమలలో ఉన్న తన స్నేహితుల వద్ద తలదాచుకునేందుకు వచ్చాడు. సాయితేజ ఫ్రెండ్‌ శివతో గొడవ జరగడంతో.. సాయితేజను మల్లెలతీర్థం ఆలయం సమీపంలో శివ బండరాయితో కొట్టి చంపాడు. అటుగా వెళ్లిన కొందరు మృతదేహాన్ని గుర్తించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారం రోజుల క్రితమే సాయితేజను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.

Crime news: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రియుడిని హత్యచేయించిన గృహిణి.. పట్టించిన నిఘానేత్రాలు

నిందితుడు శివ కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఈ కేసులో పెంపుడు కొడుకు సాయితేజ సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూలక్ష్మిని, సాయితేజను హత్య చేసిన ఘటనలో.. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.