Police Case : ముగ్గురు క్రికెటర్లపై ఉప్పల్ పీఎస్ లో కేసు నమోదు.. నకిలీ సర్టిఫికెట్లతో మ్యాచ్ లు ఆడినట్లు గుర్తింపు

నకిలీ సర్టిఫికెట్ల సమర్పించి ప్లేయర్ లు యూ-19, యూ-23 మ్యాచ్ లు ఆడారు. ఫేక్ సర్టిఫికెట్లతో లీగ్ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లను గుర్తించారు. ఈ మేరకు హెచ్ సీఏ సెప్టెంబర్ 30న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది.

Police Case : ముగ్గురు క్రికెటర్లపై ఉప్పల్ పీఎస్ లో కేసు నమోదు.. నకిలీ సర్టిఫికెట్లతో మ్యాచ్ లు ఆడినట్లు గుర్తింపు

HCA Fake Certificates Case

Three Cricketers Police Case : హైదరాబాద్ లో ముగ్గురు క్రికెటర్లపై కేసు నమోదు అయింది. నకిలీ సర్టిఫికెట్లతో లీగ్ మ్యాచ్ లు ఆడిన ముగ్గురు ఆటగాళ్లపై ఉప్పల్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. అలాగే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన ఇద్దరు ఏఎమ్ హెచ్ వోపై కూడా కేసు నమోదు అయింది. ముగ్గురు క్రికెటర్లు నికిలీ సర్టిఫికెట్లు సమర్పించి లీగ్ మ్యాచ్ లు ఆడారు. నికిలీ సర్టిఫికేట్లతో యూ-19, యూ-23 మ్యాచ్ లు ఆడారు.

ఈ మేరకు హెచ్ సీఏ హైదరాబాద్ సీపీకి లేఖ రాశారు. క్రికెటర్లు సమర్పించిన సర్టిఫికెట్లను పోలీసులకు అందజేశారు. ఈ మేరకు ముగ్గురు క్రికెటర్లవి నకిలీ సర్టిఫికెట్లని పోలీసులు తేల్చారు. దీంతో ముగ్గురు క్రికెటర్లపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అలాగే నకిలీ బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చిన ఇద్దరు ఏఎమ్ హోచ్ వోపై కేసు నమోదు చేశారు.

HCA Polls: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ అప్ డేట్స్

నకిలీ సర్టిఫికెట్ల సమర్పించి ప్లేయర్ లు యూ-19, యూ-23 మ్యాచ్ లు ఆడారు. ఫేక్ సర్టిఫికెట్లతో లీగ్ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్లను గుర్తించారు. ఈ మేరకు హెచ్ సీఏ సెప్టెంబర్ 30న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది. క్రికెట్లర్లు సమర్పించిన సర్టిఫికెట్లను హెచ్ సీఏ పోలీస్ లకు అందించారు. నకిలీ బర్త్ సర్టిఫికేట్ పై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేశారు.

అక్టోబర్ 7న హైదరాబాద్ పోలీసులు రిప్లై ఇచ్చారు. క్రికెటర్లు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవిగా పోలీసులు గుర్తించారు. తమ వయసును తప్పుగా చూపిస్తూ యూ-19, యూ-23 మ్యాచ్ లు ఆడినట్టు గుర్తించారు. దీంతో ముగ్గురు క్రికెటర్లపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేస్ నమోదు చేశారు. అంతేకాకుండా నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన ఇద్దరు అధికారులపై కూడా కేసు నమోదు అయింది.