Shobha Yatra : శోభాయాత్ర ప్రశాతంగా జరుగుతుంది-సీవీ ఆనంద్
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా జరుగుతుందని హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.

Cv Anand
Shobha Yatra : హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా జరుగుతుందని హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఈరోజు ఆయన బషీర్ బాగ్ పోలీసు కమీషనర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. కోవిడ్ కారణంగా రెండేళ్లు శోభాయాత్ర జరగలేదని కార్యకర్తలు శోభాయాత్రలో పాల్గోనేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు.
వారం రోజుల క్రితం అన్ని శాఖల అధికారులతో మీటింగ్ నిర్వహించామని ఆయన తెలిపారు. సౌత్ జోన్ నుంచి కూడా శోభాయాత్ర వస్తుందని…. నగరంలోని మిగతా ఏరియాలలో ఎక్కడి నుంచి శోభాయాత్ర నిర్వహించవద్దని ఆయన కోరారు. శోభాయాత్ర రాత్రి 8 గంటలకు పూర్తవుతుందని అనుకుంటున్నామని…. శోభాయాత్ర మొత్తాన్ని సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన తెలిపారు.
Also Read : Adimulapu Suresh : ఏపీ కేబినెట్ లిస్ట్ లో ట్విస్ట్.. ఆఖరి నిమిషంలో ఆదిమూలపు సురేష్ కు అవకాశం
నగరానికి చెందిన 6,000మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 1,000మంది కలిపి దాదాపు 7వేల మంది పోలీసులు శోభాయాత్ర విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ టీంస్ కూడా ఉన్నాయని… సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీవీ ఆనంద్ చెప్పారు.