మైలార్ దేవ్‌పల్లిలో కార్డెన్ సెర్చ్.. గంజాయి వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు

Mailardevpally: అర్ధరాత్రులు రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

మైలార్ దేవ్‌పల్లిలో కార్డెన్ సెర్చ్.. గంజాయి వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 50 మంది పోలీసులతో గత అర్ధరాత్రి ఈ ఆపరేషన్ జరిగింది. శాస్త్రీపూరం, అక్బర్ కాలనీతో పాటు ఒట్టేపల్లి, మహమ్మదీయా కాలనీ, ఒవైసీ కాలనీలో పోలీసులు తనిఖీలు చేశారు.

ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఎనిమిది మంది రౌడీ షీటర్ల ఇళ్లల్లోనూ తనిఖీలు చేసి, వారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. గంజాయిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గంజాయి వాడడం, తరలించడంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలాగే, అర్ధరాత్రులు రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతి వాహన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఓ ఆటో నిండా నిషేధిత గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. ఆటోతో పాటు గుట్కా సీజ్ చేశారు. షేక్ మహ్మద్ అనే ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గంజాయి డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది విషయం తెలిసిందే.

Also Read: దానం నాగేందర్‌‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? ఇంతకీ బీజేపీ వ్యూహం ఏంటి?