మేము రెడీ..మీరు రెడీనా : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ స్టేషన్ కు సిబ్బంది

గ్రేటర్ ఎన్నిల పోలింగ్ కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. 2020, డిసెంబర్ 01వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కానుంది. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గాల

మేము రెడీ..మీరు రెడీనా : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ స్టేషన్ కు సిబ్బంది

Polling Staff To Ghmc Polli

Updated On : December 6, 2021 / 1:12 PM IST

ghmc polling stations : గ్రేటర్ ఎన్నిల పోలింగ్ కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. 2020, డిసెంబర్ 01వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కానుంది. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గాల్లో ఉన్న కేంద్రాల్లో సిబ్బందికి 2020, నవంబర్ 30వ తేదీ సోమవారం డీఆర్ సీ సెంటర్ల నుంచి ఎన్నికల సామాగ్రీని ఇచ్చారు. సామాగ్రీని తీసుకున్న సిబ్బంది.. ఏర్పాటు చేసిన వాహనాల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను సిబ్బందికి అధికారులు తెలియచేశారు. కోవిడ్ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తూ..ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు.
9 వేల 101 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు.. బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకానుంది. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది.

150 డివిజన్ల పరిధిలో మొత్తం 11 వందల 22 మంది అభ్యర్థులు ఉన్నారు.
74 లక్షల 67 వేల 256మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
38 లక్షల 89 వేల 637మంది పురుషులు.., 35లక్షల 76వేల 857మంది మహిళా ఓటర్లు ఉన్నారు.., ఇతరులు 678 మంది ఉన్నారు.
పోలింగ్ విధుల్లో 36 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు.
9 వేల 101 మంది ప్రిసైండింగ్ అధికారులు, 9 వేల 101మంది అసిస్టేంట్ ప్రిసైండింగ్ అధికారులను నియమించారు.
60 ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు.., 30స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నారు.

17 వందల మంది మైక్రో అబ్జర్వర్స్‌.. 2 వేల 920 మంది వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షకులను నియమించింది.
30 సర్కిల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు.
28 వేల 500 బాక్స్ లు ఉపయోగించున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు బాక్స్ లు అందించనున్నారు.
మొత్తం 2 వేల 629 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు రాగా.. 19 వందల 26 పోస్టల్ బ్యాలెట్లు ఇష్యూ చేశారు.
పోలింగ్‌ కేంద్రాల్లో వృద్ధులు.., మహిళలు, వికలాంగులకు సహకరించేందుకు వాలంటీర్లు ఉండనున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో వీల్‌చైర్లను అందుబాటులో ఉంటాయి.

కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి మాస్క్ లు ఇవ్వడంతో పాటు…, ప్రతి పోలింగ్ కేంద్రానికి 2.5 లీటర్ల శానిటైజర్ కూడా అందించాలని నిర్ణయించారు.
అందుకోసం 60వేల లీటర్ల శానిటైజర్స్‌ సిద్దం చేశారు అధికారులు.