‘వాళ్లు తప్పు చేశారని చెబితే నా మీద కేసు పెడతారా?’.. యూట్యూబర్ అన్వేష్ కామెంట్స్

ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. కేసు నమోదుపై అన్వేష్ స్సందించారు.

‘వాళ్లు తప్పు చేశారని చెబితే నా మీద కేసు పెడతారా?’.. యూట్యూబర్ అన్వేష్ కామెంట్స్

YouTuber Anvesh

Updated On : May 5, 2025 / 11:38 AM IST

YouTuber Anvesh: ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం అనుమతిలేని బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేస్తున్న వారిపై అన్వేష్ తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ల పై అన్వేష్ వీడియో చేశారు.

Also Read: Rain Alert: తెలంగాణలో రెయిన్ అలర్ట్.. వచ్చే నాలుగు రోజులు ఆ జిల్లాల్లో ఈదురు గాలులతోకూడిన వానలు

తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ లు దాన కిషోర్, వికాస్ రాజ్ లపై అన్వేష్ ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వారి పేర్లను ప్రస్తావిస్తూ అన్వేష్ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో అవాస్తవంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అన్వేష్ పై హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటాగా తీసుకొని పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసంకోసం అప్లయ్ చేసిన వారికి బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఆ జాబితాలో ఉంటే మీకు లోన్ రాదు..!

తనపై కేసు నమోదు కావటంపై ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ స్పందించారు. తాను రెండు నెలలుగా బెట్టింగ్ యాప్ ల నిర్మూలన కోసం సామాజిక బాధ్యతతో అవగాహన కల్పిస్తున్నానని, తనపై కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నోఏళ్లుగా మెట్రో రైలులో బెట్టింగ్ యాప్ యాడ్స్ వేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా నాపై కేసు నమోదు చేయడం ఏమిటని అన్నారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా బలైన కుటుంబాలకు 2లక్షల ఆర్థిక సాయం చేస్తున్నానని ఇప్పటి వరకు ఐదు కుటుంబాలకు అందించానని అన్వేష్ తెలిపారు.

ఇదిలాఉంటే.. బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేసిన వారు ఎంతవారైనా విడిచి పెట్టేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది.