Amit Shah-Pawan Kalyan : తెలంగాణకు వస్తున్న అమిత్ షా, పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యే అవకాశం..పొత్తులు,సీట్లపై క్లారిటీ వచ్చేనా..?

సూర్యాపేట ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ పర్యటనలో షా.. పవన్ కల్యాణ్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. వీరి భేటీలో పొత్తులు,సీట్లపై క్లారిటీ వస్తుందా..? బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Amit Shah-Pawan Kalyan : తెలంగాణకు వస్తున్న అమిత్ షా, పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యే అవకాశం..పొత్తులు,సీట్లపై క్లారిటీ వచ్చేనా..?

Amit Shah-Pawan Kalyan

Amit Shah-Pawan Kalyan : తెలంగాణ ఎన్నికలు బీజేపీ అగ్రనేతల పర్యటనకు వేదికవుతోంది. కేంద్ర మంత్రులు వరుసగా తెలంగాణలో పర్యటనలతో రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్ అగ్రనేతలు, మరోపక్క బీజేపీ అగ్రనేతల పర్యటనలతో తెలంగాణలో రోజు రోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈక్రమంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అక్టోబర్ 27న  సూర్యాపేటలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఎన్నికల ప్రచారానికి వస్తున్నఅమిత్ షా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఓపక్క ఎన్నికల ప్రచారం ..అదే సమయంలో పొత్తుల కోసం చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తోంది.  దీంట్లో భాగంగానే అమిత్  షా.. బీజేపీ-జనసేన పొత్తులపై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

Jagga Reddy : ఎన్ని కుట్రలు చేసినా నేనే సీఎం : ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన బీజేపీని 20 సీట్లు అడుగుతోంది. కానీ టీ.బీజేపీ మాత్రం జనసేనకు 6 నుంచి10 ఇచ్చే ఆలోచనలో ఉంది. దీంతో వీరి పొత్తులపై క్లారిటీ రాలేదు. ఈక్రమంలో అమిత్ షా రాక జనసేన-బీజేపీ పొత్తులపై క్లారిటీ ఇవ్వనున్నారా..? పవన్ తో అమిత్ షా భేటీ జరిగితే తెలంగాణలో బీజేపీతో జనసేన పొ్త్తు పెట్టుకుంటుందా..? బీజేపీ ఇచ్చిన సీట్లతో సరిపెట్టుకుని పొత్తుకు ఓకే చెబుతుందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా.. బీజేపీ జనసేనకు శేర్లింగంపల్లి, కూకట్ పల్లితో పాటు ఉమ్మడి ఖమ్మలో, వైరా, కొత్తగూడెం, ఖమ్మం, మధిర, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోదాడ, హుజూర్ నగర్ తో పాటు మరికొన్ని సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు బీజేపీ నేతలు.

కాగా..ఇప్పటికే ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన తెలంగాణలో కూడా పోటీ చేయటానికి సిద్ధపడుతోంది. దీంతో తెలంగాణ బీజేపీ జనసేనతో పొత్తు కోసం ఇప్పటికే పవన్ కల్యాణ్ ను కలిశారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పనవ్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పవన్ బీజేపీతో పొత్తుకు అనుకూలంగా ఉన్నా..తెలంగాణలో జనసేనకు 32 సీట్లు కేటాయించాలని కోరినట్లుగా తెలుస్తోంది. కానీ టీ బీజేపీ మాత్రం జనసేనకు 6నుంచి 10 సీట్లు మాత్రమే ఇవ్వాలని భావిస్తోంది. దీంతో అమిత్ షా పవన్ తో భేటీ జరిగితే ఈ పొత్తులు, సీట్ల కేటాయింపులపై క్లారిటీ వస్తుందని సమాచారం.